టీడీపీకి మ‌రో భారీ షాక్‌..!

తెలంగాణ‌లో కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఇది భారీ షాకే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులతోనైనా ఉనికి చాటుదామ‌ని అనుకుంటున్న వేళ రాష్ట్ర నాయ‌క‌త్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసే వార్తే ఇది. పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుతో పార్టీలో మిగిలిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రు అలిగిపుల‌గం తింటున్నారు. మ‌రికొద్దిరోజుల్లోనే ఆయ‌న కూడా ఏదో ఒక పార్టీలోకి జంప్ అవుతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. గ్రేట‌ర్ హైదార‌బాద్‌లోని ఎల్‌బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్యేన‌ట‌. ఆయ‌న పార్టీని వీడేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌నే సొంతంగా పార్టీ పెడతారా..? లేక కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బీజేపీల్లో ఏదైనా పార్టీలో చేరుతారా..? అన్న విష‌యంలో మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు.

గ్రేటర్ హైదరాబాద్ లో…..

అంత‌టి తెలంగాణ ఉద్య‌మ గాలిలోనూ గత ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తాచాటింది. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో త‌న ప‌ట్టు నిలుపుకుంది. ఉద్య‌మ పార్టీ టీఆర్ఎస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంది. కానీ ఎన్నిక‌ల అనంత‌రం టీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డంతో ఒక్క‌సారిగా టీడీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. సీఎం కేసీఆర్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్‌తో నిలువునా కూలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ సొంతంగా 15స్థానాల్లో విజ‌యం సాధించింది. అయితే ఇందులో 12మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒక్క కోడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాత్రం అంద‌రికీ భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఇప్పుడు ఆ పార్టీకి మిగిలింది ఇద్ద‌రు ఎమ్మెల్యేలే. వారిలో ఒక‌రు ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంట‌క‌వీర‌య్య‌, మ‌రొక‌రు ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య‌.

బీసీ సంఘ నేతగా…..

బీసీ సంఘంలో కీల‌కంగా వ్య‌వహ‌రిస్తూ.. బీసీల హ‌క్కుల సాధ‌న ఉద్య‌మ నేత‌గా ఉన్న ఆర్ కృష్ణ‌య్య అనూహ్యంగా టీడీపీ-బీజేపీ కూట‌మి సీఎం అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. అయితే, ఆయ‌న ఎట్ట‌కేల‌కు ఎన్నిక‌ల్లో గెలిచారు కానీ.. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీలో అంత చురుగ్గా ఉండ‌డం లేదు. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుపై ఆయ‌న కొంత గుర్రుగా ఉంటున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు అనుకూలంగా ఉండ‌డంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇక టీడీపీలో కొన‌సాగ‌లేన‌ని గ‌తంలో ఆర్ కృష్ణ‌య్య ప్ర‌క‌టించారు. కానీ, అధికారికంగా ఆయ‌న పార్టీని మాత్రం వీడ‌లేదు. అయితే, మ‌రికొద్ది రోజుల్లోనే ఆయ‌న పార్టీని వీడ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

టీఆర్ఎస్ నుంచి ఆఫర్……

కృష్ణ‌య్య‌కు అధికార టీఆర్ఎస్ నుంచి ఆఫ‌ర్ రెడీగానే ఉంద‌ట‌. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే భువ‌న‌గిరి ఎంపీగా ఉన్న బూర నర్స‌య్య గౌడ్‌ను అసెంబ్లీకి పోటీ చేయించి అక్క‌డ నుంచి కృష్ణ‌య్య‌ను ఎంపీగా పోటీ చేయిస్తామ‌ని ఆయ‌న‌కు ఆఫ‌ర్ పంపార‌ట‌. అయితే, సొంతంగా పార్టీ పెట్టాల‌ని, ఇత‌ర పార్టీల్లోని వెళ్లొద్ద‌ని ఆయ‌న అనుచ‌రులు, బీసీ సంక్షేమ సంఘం నేత‌లు కోరుతున్న‌ట్లు స‌మాచాం. ఏదేమైనా కృష్ణ‌య్య పార్టీని వీడ‌డం టీడీపీకి మ‌రో పెద్ద షాక్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*