బిగ్ బ్రేకింగ్ : దినకరన్ కు దిమ్మ తిరిగే షాక్….!!!

dinakaranttv-dmk-tamilnadu

టీటీవీ దినకరన్ కు ఎదురుదెబ్బ తగిలింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దినకరన్ కు దిమ్మతిరిగింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. దీంతో పళనిస్వామి విశ్వాస పరీక్ష గండం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్నారు. పళని పదవికి ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో పళనిస్వామికి ఊరట లభించింది. 18 మంది ఎమ్మెల్యేలపై గతంలో ఇద్దరు న్యాయమూర్తులు విభిన్న తీర్పును వెల్లడించడంతో మూడో జడ్జికి ఈ కేసును అప్పగించింది. దినకరన్ ఈ తీర్పు తనకే అనుకూలంగా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అందుకోసమే ఆయన తన వెంట ఉన్న ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించారు. అయితే ఈ 18 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలను ఆరు నెలలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో దినకరన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*