ఉండ‌వ‌ల్లి గారూ…. ఓ స‌ల‌హా..!!

నియ‌త పోక‌డ‌ల‌తో ఆడంబరం చేసేవారు ప్రజాస్వామ్యానికి ఎంత‌చేటో.. మేధావులు మౌనంగా ఉన్నా.. మ‌డిక‌ట్టుకున్నా కూడా అంతే చేటు!! ఈ విష‌యం రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కి తెలియద‌ని కాదు! కానీ, విధిలేని ప‌రిస్థితిలోనే తాత‌కు ద‌గ్గులు నేర్పాల్సి వ‌స్తోంది. స‌మాజం బాగుండాలి. నిజాయితీతో కూడిన రాజకీయాలు రావాలి- అని కోరుకునే వారిలో నిఖార్సయిన నేత‌గా ఉండ‌వ‌ల్లికి పేరుంది. దాదాపు ఆయ‌న రాజ‌కీయాలకు దూర‌మై నాలుగున్నరేళ్లు గ‌డిచిపోయినా క‌రెంట్ అఫైర్స్‌లో ఆయ‌న పేరు పెద్దగానే వినిపిస్తోంది. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల ఆయ‌న పేరు కూడా వినిపిస్తుంది కూడా. మేధావిగా.. న్యాయ‌వాదిగా ఆయ‌నను ఎప్పుడూ ఏదో ఒక చ‌ర్చలో త‌లుచుకుంటూనే ఉంటారు.

స్వస్తి చెప్పి……

అయితే, ఇలాంటి వాళ్లు.. మొండి గోడ‌ల్లా మారితే.. ఎలా? ఇప్పుడున్న ప‌రిస్థితిలో మేం రాజ‌కీయాలు చేయం! అని మ‌డిక ట్టుకుంటే ఎలా? అనేదే ఇప్పుడు ఓ వ‌ర్గం ప్రజ‌ల‌ను వేధిస్తున్న ప్రశ్న. స‌మాజాన్ని దోచుకునేవారు ఎంద‌రో ఉన్నారు. కానీ, అధ్యయ‌నం చేసి, మంచిని చెప్పే పుచ్చల‌ప‌ల్లి సుంద‌ర‌య్య వంటి వారు వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే నేటికీ ఉండ‌డం దౌర్భాగ్యం. అయినా ఉన్నారు కాబ‌ట్టి ఒకింత సంతోషించాల్సిందే. మ‌రి అలాంటి వారిలో ప్రథ‌మ వ‌రుస‌లో ఎన్నద‌గిన వారు ఉండ‌వ‌ల్లి అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. అయితే, ఉండ‌వ‌ల్లి మాత్రం రాష్ట్ర విభ‌జ‌న తాలూకు ప్రభావంతో ఆయ‌న రాజ‌కీయాలకు స్వస్తి చెప్పి.. గ‌ట్టున కూర్చున్నారు.

ఒడ్డున కూర్చుంటే…..

కానీ, మేధావులైన వంటి వారు ఇలా ఒడ్డున కూర్చుంటే.. ప్రజాస్వామ్య భార‌తికి త‌ల‌వొంపులనేది విశ్లేష‌కుల మాట‌. జ‌రిగిందేదో జ‌రిగింది. ఇప్పుడు జ‌ర‌గాల్సింది ఏమిటో ఉండ‌వ‌ల్లి వంటి వారికి తెలియందికాదు. ఇలాంటి త‌రుణంలో అటు కేంద్రంపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి తేవాల్సిన ప‌రిస్థితి ఉంది. ఈ త‌రుణంలో మడి క‌ట్టుకుంటాను, ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి రాను అన‌డం నిజంగా మంచిని తుంచ‌డ‌మే అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన‌ స్ట్రీమ్‌లో మూడు పార్టీలు ఉన్నాయి. నూత‌న ప్రజాస్వామ్యమే ల‌క్ష్యం అంటూ జ‌న‌సేనాని పిలుపు నిచ్చారు. లేదు.. రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ జ‌గ‌న్ ఉర‌క‌లెత్తుతున్నాడు. ఇక‌, విజ‌న్ -2050 అంటూ బాబు గారు ప‌రుగులు పెడుతున్నారు.

ఇంటికే పరిమితమైతే…..

ఇక ఉండ‌వ‌ల్లి కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని జ‌గ‌న్‌, ఇటు చంద్రబాబు సైతం కాచుకునే ఉంటారు. ఆయ‌న త‌మ పార్టీలోకి వస్తామంటే ఆయ‌న‌కు తిరుగులేని ఛాన్సులే ఇస్తారు. ఈ త‌రుణంలో ఉండ‌వ‌ల్లి వంటి క్రియాశీల‌క వ్యక్తులు ఇంటికే ప‌రిమితమై.. సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోనే ల‌క్ష్మణ రేఖ‌లు గీసుకుంటే .. ఎలా అనేది మేధావుల మాట‌. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఏదైనా త‌న‌కు న‌చ్చిన పార్టీలో చేరి.. ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తే … ప్రజ‌ల ప‌క్షాన నిఖార్సయిన కంఠం ఒక‌టి చ‌ట్టస‌భ‌ల్లో వినిపించ‌క‌పోద‌నేది ప్రజ‌ల ఆశ‌. ప్రజ‌ల నాడిని కూడా ఉండ‌వ‌ల్లి వంటి వారు వినిపించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*