విజయ దేవరకొండకు కష్టాలు కన్నీళ్లు …!

ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. కానీ అప్పుడే మార్కెట్ లోకి పైరసీ రూపంలో భూతం వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. పరీక్షల కోసం బాగా చదివి పేపర్ రాసి వచ్చాక పేపర్ లీక్ అయిందన్న వార్త విన్నాకా ఒక విద్యార్థి పడే వేదనలాగే వుంది యువ హీరో విజయ దేవరకొండ పరిస్థితి. గీతా ఆర్ట్స్ వారి గీత గోవిందం చిత్రం ఈనెల 15 న థియేటర్లకు విడుదల కావాలిసి వుంది. కానీ మూడు రోజుల ముందే సినిమా లీక్ కావడం చిత్ర యూనిట్ కి జ్వరం వచ్చేలా చేసింది. ముఖ్యంగా నటించిన రెండు చిత్రాలతో స్టార్ డం సంపాదించుకున్న విజయ దేవరకొండకు మరీ షాక్ ఇచ్చింది. దాంతో ఆయన సోషల్ మీడియా ద్వారా బరస్ట్ అయ్యారు.

ప్రీ రిలీజ్ లో ఫ్రీ గా లేని విజయ్ …

గీతగోవిందం ప్రమోషన్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో ఏర్పాటైంది. చిత్ర నిర్మాత అల్లు అరవింద్ దీనికి హాజరైనా ఈ చిత్ర నిర్మాణంలో కీలకమైన బన్నీ వాసు కార్యక్రమానికి హాజరు కాలేక పోయారు. ఆయన సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న గీత గోవిందం చిత్రం లింక్ లు డిలీట్ చేసే పనిలో పడ్డారు. ఆ విషయాన్ని కూడా విజయ దేవరకొండ స్వయంగా వెల్లడించారు. తన జీవితం మొత్తం పోరాటమేనని ఇప్పుడు అదే చేస్తున్నా అని తాత్వికంగా మాట్లాడారు. ప్రతి దశలోనూ పోరాటం ఒక భాగమని ఎవరెన్ని చేసినా తనను ఈ చిత్ర విజయాన్ని ఎవ్వరు అడ్డుకోలేరని తనకు తానే ధైర్యం చెప్పుకున్నారు. పైరసీ కోసం మీకు చెప్పేదేముంది మంచి, చెడు అన్ని మీకు తెలుసంటూ నిర్వేదం గా వ్యాఖ్యానించి తనలోని ఆందోళన వ్యక్తం చేశారు విజయ దేవరకొండ. అత్తారింటికి దారేది, బాహుబలి వంటి చిత్రాలకు సైతం పైరసీ వెంటాడినా ఆ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో నిర్మాణదారులు బతికి బట్టకట్టారు. ఇప్పుడు విజయ దేవరకొండ తాజా చిత్రం గీత గోవిందం రోడ్డున పడటంతో ఇది కూడా సక్సెస్ సాధించాలని టాలీవుడ్ దీవిస్తుంది. మరి ఏమౌతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*