విజయశాంతి టీం దెబ్బకొట్టేస్తుందే …?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి తన అనుచరులు కొందరికి టికెట్లు కోరారు హస్తం పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయ శాంతి. అయితే నేతలు ఎక్కువై టికెట్లు తక్కువై కిందా మీదా పడుతున్న కాంగ్రెస్ లో పరిస్థితి నిన్న గాక మొన్న రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి గ్రూప్ కి ఇచ్చేందుకు అవకాశాలు లేవని తేలిపోయింది. దాంతో చేసేది లేక మీకు నచ్చిన బండి ఎక్కేయండని చెప్పేశారు విజయశాంతి.

కాంగ్రెస్ లో చేరాల్సిన ఆయన …

కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం గుర్తుపై పోటీ చేయాలిసిన నందీశ్వర గౌడ్ ఇప్పుడు టిడిపి లో చేరి సైకిల్ ఎక్కారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడ బెర్త్ లేదని తేలిపోయింది. దాంతో విజయశాంతి ద్వారా చివరి ప్రయత్నం చేశారు. ఆమె వల్ల పనికాదని తేలిపోవడంతో తన రెండొవ అడుగు వేసి టిడిపి తో సంప్రదింపులు చేశారు. వారు బెర్త్ కన్ఫర్మ్ చేయడంతో టి టిడిపి అధ్యక్షుడు రమణ సమక్షంలో విజయదశమి నాడు అట్టహాసంగా భారీ అనుచర గణంతో పసుపు కండువా కప్పేసుకున్నారు.

టిక్కెట్ కోసమే కదా….?

ఏ పార్టీ అయితే ఏమి టికెట్ కన్ఫర్మ్ అవునా? కాదా? అన్నది ఇప్పుడు నేతలకు ప్రతిష్టగా మారిపోయింది. నందీశ్వర్ బాటలోనే పలువురు కాంగ్రెస్ లో టికెట్ కష్టమనుకుంటే మహాకూటమిలోని పక్క పార్టీలవైపు దృష్టి పెట్టడం గమనార్హం. అయితే తనను తమ్ముకున్నవారికి బెర్త్ కన్ఫర్మ్ చేయించలేకపోతే పక్క పార్టీ చూసుకోండని విజయశాంతి సలహా ఇస్తున్నారా లేక ఆశావహులే తమ దారి తాము చేసుకుంటున్నారో త్వరలో తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*