‘ విశ్వరూపం 2 ‘ షార్ట్ & స్వీట్ రివ్యూ

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విశ్వరూపం 2 సినిమా ఐదేళ్ల పాటు ఊరించి ఊరించి ఎన్నో అవాంత‌రాలు దాటుకుని ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్రపంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. 2013లో వ‌చ్చిన విశ్వరూపం సినిమాకు కొన‌సాగింపుగా వ‌చ్చిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ‌వ్యాప్తంగా చాలా చోట్ల ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. భారీ బ‌డ్జెట్‌తో భారీ అంచ‌నాల‌తో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ బొక్క బోర్లా ప‌డిన‌ట్టు ఫ్రైమ‌రీ షో రిపోర్టులు చెపుతున్నాయి.

ఉగ్రవాదం నేపథ్యంలో…..

ఉగ్రవాదం నేప‌థ్యంలో సాగే క‌థ‌తో విశ్వరూపం 2 సినిమా ఉంటుంది. హీరో క‌మ‌ల్ భార‌త‌దేశాన్ని ఉగ్రవాదుల నుంచి ర‌క్షించుకునేందుకు ఉగ్రవాదుల సంస్థల్లో చేరి అక్కడ కుట్రల‌కు సంబంధించిన ప్రయ‌త్నాలు ఎప్పటిక‌ప్పుడు ఇండియాకు అందిస్తుంటాడు. కోర్టుకు సంబంధించిన కొన్ని సీన్ల త‌ర్వాత శేఖ‌ర్ క‌పూర్ స్కెచ్‌తో క‌మ‌ల్ పాకిస్తాన్ వెళ‌తాడు. అక్కడ నుంచి ఈ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేస్తాడు.

సీక్రెట్ ఆఫీసర్ గా….

ఒక సీక్రెట్ ఆఫీస‌ర్‌గా క‌మ‌ల్ ఎప్పటిలాగానే త‌న న‌ట‌న‌తో బాగా మెప్పించాడు. సినిమాల యాక్షన్ సీన్లు బాగా హైలెట్‌గా నిలిచాయి. అయితే సినిమా మెయిన్ కాన్సెఫ్ట్ మాత్రం ఏ మాత్రం మెప్పించ‌దు. ఫ‌స్టాఫ్ మొత్తం చాలా బోరింగ్‌గా ఉంటుంది. నెరేష‌న్ మొత్తం ఫ్లాట్‌లోనే ముందుకు సాగుతుంది. బాంబును క‌నిపెట్టే సీన్లు కూడా స‌రిగా డిజైన్ చేసుకోలేదు. చాలా రెగ్యుల‌ర్ ఫార్మాట్‌లో క‌మ‌ల్ ఈ సీన్లు తీసేశాడు.

రొమాంటిక్ ఎపిసోడ్ మాత్రం…..

ఇక మధ్యలో కమల్ మార్క్‌కు త‌గిన‌ట్టుగా తీసిన రొమాంటిక్ ఎపిసోడ్ కాస్త ఆక‌ట్టుకుంది. ఫ‌స్టాఫ్ చూసిన ప్రేక్షకుడికి బుర్ర తిరిగిపోతుంది. ఇక సెకండాఫ్ మాత్రం కొంత‌లో కొంత బెట‌ర్‌. యాక్షన్ సీన్స్ కొంత వరకు ఆకట్టుకుంటాయి. శేఖర్ కపూర్ – ఆండ్రియా ఇద్దరు కూడా వారి నటనతో ఆకట్టుకున్నారు. కమల్ తన బృందంతో కలిసి ఐఎస్ఐ సంస్థ గురించి తెలుసుకునే ప్రయ‌త్నాలు, స‌ముద్ర అడుగు భాగంలో పెట్టిన పేలుడు ప‌దార్థాల గురించి తెలుసుకునే ప్రయ‌త్నాలు కొంత‌లో కొంత బెట‌ర్‌.

రెండు యాక్షన్ సీన్లు మినహా……

ఫైన‌ల్‌గా సెకండాఫ్‌లో వ‌చ్చే రెండు యాక్షన్ సీన్లు మిన‌హా ఓ త‌లాతోకా లేని క‌థ‌నంతో క‌మ‌ల్ విశ్వరూపం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. విశ్వరూపం సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమా ఏ మాత్రం ఆక‌ట్టుకునేలా లేదు. మ‌రి భారీ బ‌డ్జెట్‌తో ఐదేళ్ల పాటు ఊరించి ఎట్టకేల‌కు థియేట‌ర్లలోకి వ‌చ్చిన ఈ సినిమా ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలుగుపోస్ట్‌.కామ్ పూర్తి రివ్యూలో కొద్ది సేప‌ట్లోనే క‌లుసుకుందాం.