కేసీఆర్ కన్నెర్ర బాబుపైనేనా?

nara chandrababunaidu-kchandrasekharrao

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైన టిఅర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? ఓటుకు నోటు కేసులో వున్న చంద్రబాబుపైన టిఅర్ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునేట్లుగా కనబడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సియం కేసిఆర్ స్కామ్ లపైన జరిపిన సమీక్ష ఇందుకు అవుననే చెబుతుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసుతో పాటుగా ఐఎంజి భారత్ స్కామ్ లను కూడా సీయం కేసిఆర్ సమీక్షించారు. ఈ రెండు స్కామ్ లలో కూడా చంద్రబాబు పైన ఆరోపణలు వున్నాయి.

స్కామ్ లపై దృష్టి…..

గత ప్రభుత్వ హాయంలో జరిగిన స్కామ్ లపైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్కామ్ లు చేసి దర్జాగా తిరుగుతున్న నిందితులకు సరియైన శిక్షలు వేయించే దిశలో ముఖ్యమంత్రి బిజీగా వున్నారని సమాచారం. ఓటుకు నోటుతో పాటుగా హౌసింగ్ స్కామ్ లపైన సియం రివ్యూ చేయడం సంచలనంగా మారింది. స్కామ్ లపైన సియం కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇప్పడు రాజకీయ నేతలకు వణుకు పుడుతోందన్న ప్రచారం జరుగుతోంది.

నాలుగు గంటల పాటు సమీక్ష….

నాలుగు గంటల పాటు ఈ కేసుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డిజిపి మహేందర్ రెడ్డితో పాటుగా ఎసిబి డిజి పూర్ణ చందర్ రావు. మాజీ ఐపిఎస్ అధికారి ఎకె ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవిన్ చంద్ లతో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు. ఇందులో భాగంగా ఈ కేసుల పురోగతితో పాటుగా విచారించాల్సిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం..కాకపొతే ప్రధానంగా ఓటుకు నోటు కేసును సమీక్షించారు. ఇందులో చంద్రబాబు వాయిస్ రికార్డులతో పాటుగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలపైన చర్చలు జరిగిన్నట్లుగా సమాచారం. ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దృష్య్ఠా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న దానిపైన చర్చ జరిగింది. ఇక పొతే ఇందులో ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యేతో పాటుగా జెరుసలం ముత్తయ్యలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల విచారణ కూడా త్వరలోనే సుప్రీం విచారణ జరిపే అవకాశం కూడా వుంది.

ఓటుకు నోటు కేసులో….

ఇదిలా వుంటే ఓటుకు నోటు కేసు పూర్వాపరాలు…. ప్రస్తుత స్దితితో పాటుగా ముందు చేయాల్సిన ఆంశాలు ఈ సమీక్షి సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఓటుకు నోటు కేసులో ఇంకా విచారించాల్సిన ఆంశాలతో పాటుగా తదుపరి తీసుకొకోవాల్సిన చర్యలపైన కూడా చర్చలు జరిగినట్లుగా సమాచారం ..అయితే చట్ట పరంగా తీసుకొవాల్సిన చర్యలపైన సమీక్షించారు. ఈ కేసు ఇప్పటికే రాజకీయ దుమారం రేగి ఎన్నో మలుపులు కూడా తిరిగింది. చంద్రబాబు నాయుడు చుట్టూనే ఈ వ్యవహారం జరిగింది. రేవంత్ రెడ్డి ఏకంగా కేసిఆర్ ను టార్గెట్ చేసుకుని అప్పడు టిడిపి పార్టీలో పనిచేశాడు. ఇప్పడు టీడీపీని వదిలి పెట్టి కాంగ్రెస్ లో కి వచ్చాడు.

భూ ఒప్పందాలపైన కూడా….

దీనితో పాటుగా ఐఎంజీ భారత్ పేరుతో జరిగిన భూ ఒప్పందాలు స్టోర్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపైన ఒక కేసు కూడా ఎసిబి లో నమోదు అయ్యింది. ఈ కేసులో కూడా ఎసిబి చాలా వరకు పురోగతి సాధించింది. అయితే అప్పటి పాలకులు ఈ కేసును పట్టించుకొక పొవడంతో పదిహేను సంవత్సరాలుగా ఈ కేసు దుమ్ముకొట్టుకుని పొయింది. అయితే ఈ కేసులో తదుపరి చర్యలపైన కూడా సమీక్ష జరిగిందని సమాచారం. ఇక పొతే కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జరిగిన హౌసింగ్ స్కామ్ పైన కూడా సియం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ స్కామ్ పైన ఇప్పటికే సిఐడి విచారణ జరిపింది. ఈ స్కామ్ లో కింది స్దాయి నాయకుల దగ్గర నుంచి అధికారంలో వున్న నాయకుల వరకు ఉన్నట్లు బయట పడింది. ఇప్పటికే మూడు జిల్లాలను శాంపిల్ గా తీసుకుని సిఐడి విచారణ చేసింది. ఈ విచారణ లో పలు విషయాలు కూడా బయటికి వచ్చాయి. అయితే నాయకులతో పాటుగా అధికారులపైన చర్యలు తీసుకొకోవల్సి వుంది. ఈ కేసులన్నింటి పైనా సమగ్రంగా విచారణ జరిపి ఒక్క నిర్ణయం తీసుకుందామని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*