డ్యామేజ్ కంట్రోల్ లో జగన్…!

ఏ చిన్న తప్పు జరిగినా వ్యతిరేక మీడియా లో వస్తున్న విస్తృత ప్రచారానికి వైసిపి లో భయం కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకూడదని ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతుంది. చిన్న చిన్న విషయాలు వ్యవహారాలు గతంలో చూసీ చూడనట్లు వదిలివేసిన వైఎస్సాఆర్ పార్టీ ఈసారి అలాంటి వాటిపైనా ఫోకస్ పెట్టి డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టింది. దీనికి ఉదాహరణే తూర్పుగోదావరి జిల్లాలో జగన్ అడుగుపెట్టగానే జరిగిన చిన్న పొరపాటు ను సరిదిద్దుకునే పనిలో వైసిపి చీఫ్ పడ్డారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు కోసం జగన్ ప్రస్తావించకపోవడం దాంతో అలిగి ఆయన కుటుంబం పర్యటనకు దూరమైందంటూ మీడియా లో జరిగిన ప్రచారం వైసిపి శిబిరంలో అలజడి రేకెత్తించింది.

రంగంలోకి జక్కంపూడి రాజా …

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుటుంబం జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో రెండోరోజు కనపడకపోవడం చర్చనీయాంశం అయ్యింది. తనకుమార్తె పుట్టినరోజు కారణంగా జక్కంపూడి రాజా తాను తరువాతి రోజు పర్యటనకు వెళ్ళలేదంటూ రెండు రోజులు ఆలస్యంగా ప్రకటించడంతో జగన్ తో గ్యాప్ నిజమే అనే వాదన పెరుగుతూ వచ్చింది. దాంతో కొత్తపేట నియోజకవర్గం పర్యటనలోను రావులపాలెం సభలోను గన్నవరం రాజోలు సభల్లో జక్కంపూడి రాజా జగన్ వాహనంపై ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.

ఆచి తూచి అడుగులు…..

తమ ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే తమకుటుంబం నడుస్తుందని, వ్యతిరేక మీడియా తామిద్దరినడుమ గ్యాప్ వచ్చిందని చేస్తున్న ప్రచారం నమ్మొద్దంటూ రాజోలు సభలో క్లారిటీ ఇవ్వడం గమనార్హం. అనారోగ్యం వచ్చి మంచాన పడినా తనతండ్రిని మంత్రివర్గంలో కొనసాగించడం లక్షలరూపాయలు వెచ్చించి అమెరికా పంపి వైద్యం చేయించడం స్వర్గీయ వైఎస్ కే చెల్లిందని ఆయన కుటుంబానికి కడవరకు వెంటే ఉంటామని రాజా ప్రకటించడం అదీ తన తల్లితండ్రుల స్వస్థలం లో చెబుతున్నా అని చెప్పడం విశేషం. గతంలో అయితే ఇలాంటి అంశాలకు జగన్ అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం ప్రతి విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని జక్కంపూడి ఉదంతం లో స్పష్టం అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*