అక్క‌డ ఒక‌రిని ఒక‌రు ఓడిస్తారు… జ‌గ‌న్ ఏం చేస్తారో…?

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే జిల్లాలో మెట్ట ప్రాంతం నుంచి స్టార్ట్ చేసి డెల్టాలో యాత్ర చేస్తోన్న జ‌గ‌న్ నేడు క‌ళ‌ల‌కు పుట్టిల్లు అయిన పాల‌కొల్లులోకి ఎంట‌ర్ అవుతున్నాడు. సినిమా, క‌ళ‌ల ప‌రంగా ఎంతోమంది ప్ర‌ముఖుల‌కు పుట్టిల్లు అయిన పాల‌కొల్లు రాజకీయ సంచ‌ల‌నాల‌కు కూడా కేంద్ర బిందువే. మెగాస్టార్ చిరంజీవి సొంత జిల్లా అయిన పాల‌కొల్లులో ఆయ‌న 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్య‌ర్థి బంగారు ఉషారాణి చేతిలో ఓడిపోయారు. ఇది సంచ‌ల‌నాల‌కే పెద్ద సంచ‌ల‌నం.

ప్రక్షాళన చేయాల్సిందేనా?

ఇక తాజాగా జ‌గ‌న్ యాత్ర పాల‌కొల్లులోకి ఎంట‌ర్ అవుతోన్న వేళ ఆయ‌న ఇక్క‌డ వైసీపీలో చేయాల్సిన ప్ర‌క్షాళ‌న చాలా ఉంది. ప్ర‌స్తుతం ఇక్కడ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఉన్నారు. ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉంది. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి చేయ‌డంలో మాత్రం ఆయ‌న‌కు కాస్తో కూస్తో పేరుంది. ఇక్క‌డ నిమ్మ‌ల బ‌లం క‌న్నా విప‌క్ష వైసీపీ బ‌ల‌హీన‌తే ఆయ‌న‌కు ప్ర‌ధాన బ‌లం.

వైసీపీలో గుణ్ణం వ‌ర్సెస్ మేకా …

పాల‌కొల్లు వైసీపీలో రెండు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన గుణ్ణం నాగ‌బాబుకు, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం జ‌రుగుతోంది. వాస్త‌వంగా చెప్పాలంటే వీరిద్ద‌రిలో ఎవ‌రికి సీటు ఇచ్చినా మ‌రొక‌రు వాళ్లను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. 2004లో గుణ్ణం నాగ‌బాబుకు కాంగ్రెస్ సీటు ఇచ్చిన‌ప్పుడు మేకా శేషుబాబు కాంగ్రెస్ రెబ‌ల్‌గా పోటీ చేసి 13 వేల ఓట్లు చీల్చి నాగ‌బాబు ఓట‌మికి కార‌ణ‌మ‌య్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో సీటు కోసం ఇద్ద‌రూ పోటీ ప‌డినా జ‌గ‌న్ ఎమ్మెల్సీగా ఉన్న శేషుబాబుకు సీటు ఇస్తే నాగ‌బాబుకు సీరియ‌స్‌గా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ట్ర‌యాంగిల్ ఫైట్‌లో శేషుబాబు ఓడిపోయారు.

నాగ‌బాబు మార‌తాడా..?

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మేకా శేషుబాబును త‌ప్పించిన జ‌గ‌న్ ఇక్క‌డ సామాజిక ఈక్వేష‌న్ల కోణంలో కాపు వ‌ర్గానికి చెందిన గుణ్ణం నాగ‌బాబుకు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాగ‌బాబు వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆయ‌న‌కు శేషుబాబుతో పాటు ఆయ‌న వ‌ర్గం ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ లేదు. ఇక ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో నాగ‌బాబు ఇక్క‌డ నుంచి గెలుస్తారా ? అన్న ప్ర‌శ్న‌కు వైసీపీ వాళ్ల‌లోనే ఎస్ అని రావ‌డం లేదు.

బాబ్జీ రూటు ఎటు..?

మాజీ ఎమ్మెల్యే, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ రెబ‌ల్‌గా పోటీ చేసి ఓడిన డాక్ట‌ర్ బాబ్జీని వైసీపీలోకి తీసుకువ‌చ్చి ఆయ‌న్ను ఇక్క‌డ పోటీ చేయిస్తే బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. పీకే స‌ర్వేల్లో కూడా ఇదే విష‌యం స్ప‌ష్ట‌మ‌వ్వ‌డంతో ఇప్పుడు వైసీపీ వాళ్లు బాబ్జీని దువ్వేప‌నిలో బిజీగా ఉన్నారు. పొలిటిక‌ల్‌గా తిరిగి స‌త్తా చాటాల‌ని చూస్తోన్న బాబ్జీ ప్ర‌స్తుతానికి మౌనంగా ఉన్నా ఎన్నిక‌ల వేళ కీల‌క డెసిష‌న్ తీసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. బాబ్జీకి ఇక్క‌డ వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకుతో పాటు పార్టీ ఓటు బ్యాంకు కూడా తోడైతే వైసీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌న్న ధీమాతో ఆ పార్టీ నాయ‌కులు ఉన్నారు. వీరితో పాటు ఒక‌రిద్ద‌రు నేత‌లు కూడా వైసీపీ టిక్కెట్ రేసులో ఉన్నారు. మ‌రి జ‌గ‌న్ ఇక్క‌డ పార్టీకి ఎలా చికిత్స చేస్తారో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*