ఉప ఎన్నిక‌లొస్తే…. జగన్ ఇలాకాలో టఫ్ ఫైటేనా….!

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న మాజీ వైసీపీ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి కేంద్రంలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయని భావిస్తున్న నేప‌థ్యంలో మంత్రి ఆది పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్‌తో రాష్ట్ర‌లో అధికార, విప‌క్షాలు త‌మ త‌మ పంథాల్లో కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని పేర్కొంటూ.. విప‌క్షం వైసీపీ ఎంపీలు ఐదుగురు కేంద్రం ప్ర‌త్య‌క్ష పోరుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంపై అవిశ్వాసం ప్ర‌క‌టించారు. అనంత‌రం వైసీపీకి చెందిన ఐదుగురుఎంపీలు కూడా తమ ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించారు. అనంత‌రం.. వీరు ఆమ‌ర‌ణ నిరాహాక్ష‌కు దిగారు.

రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం…..

క‌ట్ చేస్తే.. నెల‌ కింద‌ట చేసిన ఈ రాజీనామాల‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకునే అ వ‌కాశం ఉంది. ఇప్ప‌టికే అక్క‌డ క‌ర్ణాట‌క‌లో ఎమ్మెల్యేలుగా గెలిచిన య‌డ్యూర‌ప్ప, శ్రీరాములు త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌గా స్పీక‌ర్ వాటిని వెంట‌నే ఆమోదించేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా ఆమోదించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఒక‌వేళ ఈ రాజీనామాలను స్పీక‌ర్ ఆమోదిస్తే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌చ్చితంగా నాలుగు మాసాల్లోనే ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ త‌రుణంలో త‌మ స‌త్తా చాటాల‌ని అధికార టీడీపీ పెద్ద‌లు నిర్ణ‌యించుకున్నారు.

మంత్రులకు అవకాశం ఇవ్వాలని…..

వైసీపీ ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు వ‌స్తే.. చంద్ర‌బాబు ఈ స్థానాల్లో మంత్రుల‌కు అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి ఆదినారాయ‌ణ‌పేరు క‌డ‌ప ఎంపీ సీటుకు బ‌లంగా వినిపిస్తోంది. ఇక్క‌డ ఆది విజ‌యం సాధిస్తే.. మ‌రో ప‌ది మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఇక్క‌డ విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. కడప లోక్‌సభ సీటు ఎప్పుడూ వైఎస్ కుటుంబానిదే. పులివెందులలో వచ్చే మెజార్టీనే ఆ పార్టీకి ఆ సీటును తెచ్చి పెడుతోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి ఎంపీ అభ్యర్థి అయితే ఆ ఎఫెక్ట్… జిల్లా మొత్తం ఉంటుంది. జమ్మలమడుగులో… రెండు వర్గాలు ఏకం కావడంతో.. కనీసం 70 వేల ఓట్ల మెజార్టీ వస్తుంది. ఈ సారి పులివెందులలో కూడా… ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశం లేదు.

జమ్మల మడుగులో ఇదే జరిగితే…..

అదే సమయంలో… రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. సొంత బంధువులకు అవకాశం ఇచ్చేందుకుజగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది అస‌మ్మ‌తికి దారి తీసే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఈ మూడు సీట్ల‌లో రెండు చోట్ల సిట్టింగ్ క్యాండెట్లు మారినా వైసీపీకి పెద్ద దెబ్బే. ఇక క‌మ‌లాపురంలో జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆది, రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చితే ఇక్క‌డ ఒక‌రు ఎంపీ, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఓకే చెపితే జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీకి తిరుగులేని మెజార్టీ వ‌స్తుంది. అప్పుడు క‌డ‌ప ఎంపీ సీటుకు టీడీపీ ట‌ఫ్ ఫైట్ ఇస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*