బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర వాయిదా

High court questioned ap govt on Jagan attack case

జగన్  ప్రజాసంకల్ప పాదయాత్ర మరోసారి వాయిదా పడే అవకాశముంది. వాస్తవానికి రేపటి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే భుజానికి పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో వైద్యులు పాదయాత్ర వాయిదా వేసుకోవలని సూచించారు. జగన్ ఎడమ భుజం వాయడంతో ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర జరిగే అవకాశముంది. జగన్ ఎడమ భుజం కండరాలు ఇంకా నొప్పిగా ఉండటంతో ఆయన పాదయాత్ర చేయలేరని తెలుస్తోంది. గాయం పూర్తిగా మానిన తర్వాతనే పాదయాత్ర ప్రారభం కానుంది. గత నెల 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*