పుష్కరాలనుంచి…. జగన్ పై దాడి వరకు ….?

విశాఖ ఎయిర్ పోర్ట్ నౌకాదళం పర్యవేక్షణలో ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక విమానాశ్రయాల్లో విశాఖ ఒకటి. సాధారణ బస్సు, రైలు స్టేషన్ లనుంచి కిళ్ళీ కొట్ల వరకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ సిసి టివిలు అసలు నేరస్థులను, దాడులను పట్టిస్తున్నాయి. అనేక యాక్సిడెంట్ ల తీరును దృశ్యీకరించి భవిష్యత్తు లో తీసుకోవాలిసిన జాగ్రత్తలు హెచ్చరిస్తుంది సిసి టివి. కానీ కీలక సందర్భాల్లో మాత్రం ఈ సిసి టివిలు పనిచేయడం లేదంటూ పోలీసులు కోర్టు లకు చెప్పడం అనేక సందేహాలకు తావిస్తుంది.

గోదావరి పుష్కరాలకు అదే …

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. 29 మంది భక్తులు తొక్కిసలాటలో అనంత లోకాలకు వెళ్ళిపోయారు. పుష్కరాలకు ముందు 174 ప్రధాన ఘాట్స్ లో సిసి టివిలు ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ కి లింక్ చేసి ఎప్పటికప్పుడు మానటరింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే తొక్కిసలాటలో ఎప్పుడైతే అనేక మంది చనిపోగానే ఎపి సిఎం చంద్రబాబు పోలీస్ కమాండ్ కంట్రోల్ కి వెళ్ళి సిసి టీవీల్లో సంఘటన మొత్తం చూశారు. అక్కడినుంచి అన్ని పర్యవేక్షించారు. అప్పటివరకు మీడియా ముందే అన్ని పనిచేసిన సిసి టివి కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నాటి సంఘటన తరువాత ప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజులు కమిషన్ కి సిసి ఫుటేజ్ సమర్పించలేమని తేల్చి చెప్పింది. కెమేరాలు పనిచేయలేదని పోలీస్ శాఖ వివరణను ఇచ్చింది. సంఘటన తరువాత మాత్రం కెమేరాలు పని చేయడం సర్కార్ వైఫల్యాన్ని చెప్పక చెప్పింది.

విభజన సమయంలోను అంతే …

ఎపి విభజన సమయంలో లోక్ సభ లో ఎంపిలు కొట్టుకున్నారు. స్పీకర్ తలలు కూడా లెక్కించకుండా ఏకపక్షంగా బిల్లు ఆమోదించినట్లు ఘర్షణల నడుమే ఆమోదం అయినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఈ అంశంపై మాజీ ఎంపి అరుణ కుమార్ సుప్రీం కోర్ట్ లో కేసు వేశారు. పార్లమెంట్ సిసి ఫుటేజ్ రొటీన్ గా ఫిర్యాది కోర్టు కోరినా ఆ సమయంలో సిసి టివిలు పనిచేయడం లేదని తేల్చారు. ఆనాటి సంఘటన నేటికీ చర్చనీయాంశమే అయ్యింది. తలుపులు మూసి కెమేరాలు ఆపి రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేశారన్న ఆరోపణలు నిజం అనేది ప్రజలు నమ్మేలా చేసింది.

కర్ణాటక లో సుప్రీం …

కర్ణాటకలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడుయూరప్ప బలనిరూపణను సిసి టివిల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో బేరసారాలకు అవకాశం లేకుండా పోయింది. బిజెపి సర్కార్ ఏర్పడిన వెంటనే కుప్పకూలింది. దీనికి ప్రత్యక్ష ప్రసారమే కారణమని దేశవాసులు ఇప్పటికి భావిస్తారు.

జగన్ పై దాడి కేసులో …

వాస్తవానికి విపక్ష నేత జగన్ పై దాడి కేసులో నిజం తెలియాలంటే సిసి టివి ఫుటేజ్ ఎంతో కీలకం. కేసు దర్యాప్తులో అసలు నిజాలు ఈ ఫుటేజ్ ఉంటే బయటపడేవి. ప్రభుత్వమే దాడి వెనుక ఉందని విపక్షం. వైసిపి అభిమాని ఇది చేశాడని, అది చిన్న సంఘటనే అనే రీతిలో అధికారపార్టీ విమర్శలు ఆరోపణలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫుటేజ్ విడుదల చేసి ఉంటే దాడి కి ముందు నిందితుడి ప్రవర్తన, ఎవరిని కలిసింది అన్ని బయటకు వచ్చేవి. నిందితుడు కత్తి బయటకు ఎలా తీశాడు? జగన్ మెడకు గురిపెట్టాడా..? లేదా..? వంటి అంశాలు స్పష్టం అయ్యేవి. కానీ ఇవన్నీ బయటకు రాకూడదనే రీతిలో సిసి టివిలు మూడు నెలలలనుంచి పనిచేయడం లేదని హై కోర్టు కి నివేదించడం ద్వారా ఈ కేసు లో నిజాలు సమాధిచేస్తున్నారా అనే అనుమానాలనే పెంచుతుందని ప్రజలు భావించేలా దర్యాప్తు సాగుతుందనే చర్చ విశ్లేషకులు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*