ఇక్కడ జగన్ ఫిక్స్ చేసేశారా?

ఉద్దానం వాకిట కొత్త పోరుకు తెర‌లేచింది. ఇద్దరు కీల‌క నేత‌లు నువ్వా నేనా అన్నట్లు త‌ల‌ప‌డ‌నున్నారు. వారే కిల్లి కృపారాణి, గౌతు శిరీష‌.. ఒక‌రు ఉద్దండులు.. ఒక‌రు రాజ‌కీయాల‌కు ఇంకా కొత్త.. సీనియ‌ర్ వెర్సస్ జూనియ‌ర్ అన్నట్లు సాగే పోరులో గెలిచేది ఎవ‌రు నిలిచేది ఎవ‌రు? ఫ‌ర్ దిస్ జ‌స్ట్ లాగిన్‌.

వార్ ఒన్ సైడేనా… !!!

పోరాటాలకు పురిటిగ‌డ్డ అయిన సిక్కోలులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య అన్ని జిల్లాల్లోనూ హోరాహోరీ పోరు త‌ప్పేలా లే దు. జిల్లాలో అధికార పార్టీలో లుక‌లుక‌లు, వైసీపీకి ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన‌, ప్రజ‌ల్లో ప‌లుకుబ‌డి ఉన్న క్యాండెట్లు ప్లస్ అవుతుండ‌డంతో ఇ క్కడ పోరు ర‌స‌వ‌త్తరం కావ‌డం త‌థ్యం.ఇక జిల్లాలో తాజా హాట్ పొలిటిక‌ల్ అప్‌డేట్ ఏంటంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ ఎంట్రీ. ఇది కూడా కొద్ది రోజుల్లోనే క‌న్ఫం కానుంద‌ని టాక్‌.అయితే ఆమెకు ధ‌ర్మాన ఎంత వ‌ర‌కూ మ‌ద్దతు ఇస్తార‌న్నది ఓ ప్రశ్న. జిల్లాలో ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం ఎంపీ సెగ్మెంట్ ప‌రిధిలో బ‌లంగా ఉన్న కాళింగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కృపారాణి డాక్టర్‌గా ఏనాటి నుంచో టెక్కలి ప‌రిస‌ర ప్రాంతాల‌కు చిర‌ప‌రిచితులు.2004లో ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన ఆమె 2009లో లెజెండ్రీ ఎర్రన్నాయుడిని ఓడించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు.

విభ‌జ‌న ఫ‌లితంగా..

గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయినా కృపారాణి మాత్రం అదే పార్టీ నుంచి సిట్టింగ్ కేంద్రమంత్రి హోదాలో పోటీ చేసి ఓడారు. ఆమె భ‌ర్త టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీప‌డ్డారు.ఏపీలో కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ లేక‌పోవ‌డంతో కృపారాణి దంప‌తులు త‌మ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలోకి వెళ్లేం దుకు రెడీ అవుతున్నారు. వాస్తవానికి కృపారాణి వైసీపీ ఎంట్రీపై ఆరేడు నెల‌లుగా వార్తలు వ‌స్తున్నాయి. ఆమె స్వస్థలం టెక్కలి. ప్రస్తుతం అదే ని యోజ‌కవ‌ర్గం ఎర్రన్న ఫ్యామిలీకి కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గమే. అక్కడ నుంచే మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

టెక్కలి సీటుపై పీట‌ముడి…

వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్న కృపారాణి గ‌తంలో జ‌గ‌న్‌తో జ‌రిపిన చ‌ర్చల్లో ఆమె టెక్కలి సీటు కోసం ప‌ట్టుబ‌ట్టారు.అయితే ఇప్పటికే అక్కడ వై సీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి.గ‌త మూడు ఎన్నిక‌ల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోతోన్న దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు పేరాడ తిల‌క్ ఇద్దరూ పోటీ ప‌డుతున్నారు. దీంతో జ‌గ‌న్ టెక్కలి సీటు కృపారాణికి ఇచ్చేందుకు హామీ ఇవ్వలేదు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర గోదావ‌రి జిల్లాల‌కు చేరుకోనుండ‌డం, పొలిటిక‌ల్ మూమెంట్ స్టార్ట్ అవ్వడంతో మ‌ళ్లీ కృపారాణి – వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చలు జ‌రిగాయి.ఈ చ‌ర్చల్లో ఆమె మ‌ళ్లీ టెక్కలి సీటే కోర‌గా జ‌గ‌న్ ఈ సీటుపై హామీ ఇవ్వలేన‌ని, కాళింగ సామాజిక‌వ‌ర్గం ఎక్కువగా ఉన్న ప‌లాస నుంచి పోటీ చేయాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

బాప్ రే….ఇట్స్ ఫిక్స్ రే….

ప‌లాస‌లో ప్రస్తుతం టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గౌతు శ్యాంసుంద‌ర శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ టీడీపీ నుంచి శివాజీ కుమా ర్తె, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష పోటీ దాదాపు ఖ‌రారైంది.చంద్రబాబు ఆమెను గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్కడ పోటీ చేయించాల‌ని అనుకున్నా శివాజీ ఇదే త‌న‌కు ఆఖ‌రు పోటీ అని చెప్పడంతో కాద‌న‌లేక‌పోయారు.ఆ..త‌ర్వాత ఆమెకు జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్పగించారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో శిరీషే టీడీపీ అభ్యర్థి అని బాబు ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. అయితే కీల‌క కోట‌రీలో ప్రస్తుతం శివాజీ అల్లుడు వెంక‌న్న చౌద‌రి కీ రోల్ గా ఉండేందుకు ట్రై చేస్తున్నార‌ని టాక్‌. వాస్తవానికి ఇటు కృపారాణి నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికేత‌రురాలు అయినా ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం, నియోజ‌కవ‌ర్గంలో ఉన్న బ‌ల‌మైన కాళింగ సామాజిక‌వ‌ర్గం క‌లిసి రానున్నాయి. అలానే శిరీషకు కుటుంబ నేప‌థ్యం కొంత ప్లస్ అదే మైన‌స్ కూ డా..! అదే ఎందుక‌న్నది ముందున్న రోజుల్లో తేలిపోనుంది.. !!