బాబుకంటే జగన్ బెటర్… ఈవిషయంలో…..!!

మ‌నిషిలో ఆవేశం వ‌స్తే.. నిజానిజాలు వాటంత‌ట అవే మ‌రుగున ప‌డిపోతాయి. ఇది సాధార‌ణ మ‌నుషుల‌కు ఎలాంటి వారికై నా ఎదుర‌య్యే స‌మ‌స్యే! అయితే, తాను అంద‌రికీ అతీతుడిన‌ని, త‌న‌కు ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అంటూ ప‌దే ప‌దే చెప్పుకునే చంద్రబాబు కూడా ఇప్పుడు సాధార‌ణ మాన‌వుడి స్థాయికంటే కూడా దిగ‌జారిపోయారు. ఆవేశంలో ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో కూడా మ‌రిచిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ పెద్ద మనుషులు తిత్లీ తుఫాను బాధితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఏమనాలి ? ఉద్దానం తుఫానుతో తీవ్రంగా నష్టపోతే కనికరం లేకుండా వ్యవహరించారు. అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

కోటి విరాళమిచ్చిన వైసీపీ…..

పక్కనే విజయనగరం జిల్లాలో జగన్‌ పర్యటిస్తున్నా కనీసం తుఫాను బాధితులను పలకరించడానికి రాలేదు- అని ప‌నిలో ప‌నిగా విప‌క్ష నేతపై చంద్రబాబు విమర్శలు సంధించారు. అంత‌టితో ఆగ‌కుండానే తిత్లీ బాధితుల‌కు జ‌గ‌న్ ఏం చేశార‌ని కూడా ప్రశ్నించారు. ఈ ప్రశ్న‌లే ఇప్పుడు బాబుకు బూమ‌రాంగ్ అవుతున్నాయి. శ్రీకాకుళం తుఫాను విష‌యం తెలియ‌గానే కీల‌క నాయ‌కుల‌ను జ‌గ‌న్ రంగంలోకి దింపారు త‌మ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒక నెల జాతానికి త‌క్కువ కాకుండా వ‌సూలు చేసి దాదాపు రూ.కోటి వ‌ర‌కు జ‌గ‌న్ శ్రీకాకుళం వ‌ర‌ద బాధిత పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే త‌న ప్రతినిధులుగా సీనియ‌ర్లను అక్కడికి పంపి విష‌యాలు తెలుసుకునేందుకు, బాధితుల‌ను ఓదార్చేందుకు ప్రయ‌త్నించారు.

జగన్ వచ్చి ఉంటే….

అయితే, జ‌గ‌న్ స్పాట్‌కు రాలేద‌ని, బాధితుల‌తో మాట్లాడ‌లేద‌ని చంద్రబాబు అంటున్నారు. వాస్తవానికి ఏ విప‌క్ష నాయ‌కుడు వ‌చ్చినా.. ప్రజ‌లు చెప్పే ఒకే ఒక్కమాట‌.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇప్పుడు కూడా త‌మ‌కు ఇబ్బంది పెడుతున్నార‌ని వారు అంటారు. ఇక‌, ఓ విపక్ష నాయ‌కుడిగా జ‌గ‌న్ చేయాల్సిన త‌దుప‌రి కార్యక్రమం… అధికార ప‌క్షాన్ని ఎండ‌గ‌ట్టడ‌మే. అయితే.. ప్రస్తుతం జ‌గ‌న్ పై హత్యాయత్నం జరగడంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ నిజంగానే ఆనాడు తిత్లీ బాధితులను ప‌రామ‌ర్శించి, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాట్లాడి ఉంటే.. ఇప్పుడు కూడా రాజ‌కీయాలేనా అని ఎదురు దాడి చేసేందుకు తెలుగు త‌మ్ముళ్లు రెడీ అయ్యారు. కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి. ఎలాంటి కామెంట్లను ఇప్పటి వ‌ర‌కు చేయ‌లేదు. దీనిని బ‌ట్టి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ క‌న్నా జ‌గ‌నే బెట‌ర్ అనే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*