జ‌గ‌న్ బాటే ప‌ట్టాల్సి వ‌చ్చిందిగా…..!

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయో చెప్పడం క‌ష్టం. నేత‌ల మాట‌లు ఎప్పుడు ఎలా యూట‌ర్న్ తీసుకుంటాయో కూడా ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు అచ్చు అలాంటి ప‌రిణామ‌మే జ‌న‌సేనాని ప‌వ‌న్ విష‌యం లో చోటు చేసుకుంది. ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. అధికార‌ప‌క్షంలో చెలిమి చేస్తున్న స‌మ‌యంలో విప‌క్షం వైసీపీని నిలువునా ఎండ‌గ‌ట్టిన ప‌రిస్థితి ఉంది. జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శలను, వ్యాఖ్యల‌ను సైతం ఆయ‌న విమ‌ర్శించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర క్రమంలోనే అనేక మంది పేద‌లు, మహిళ‌ల‌ను క‌లుసుకునేవా రు. వారి స‌మ‌స్యలను సావ‌ధానంగా విని ప‌రిష్కారానికి విన‌తులు స్వీక‌రించేవాడు.

వినతులను వింటూ…హామీలు ఇస్తూ….

ఈ క్రమంలోనే జ‌గ‌న్‌.,. త‌న‌కు విన్నపాలు చేసిన వారికి, విన‌తులు స‌మ‌ర్పించిన వారికి అభ‌యం ఇస్తూ.. తాను అధికారం లోకి రాగానే వాటిని ప‌రిష్కరిస్తాన‌ని చెప్పేవాడు. దీంతో ప్రజ‌ల్లో ఒక‌విధ‌మైన స్వాంతన చేకూరేది. త‌మ బాధ కొంత మేర‌కై నా తీరింద‌ని, జ‌గ‌న్ దృష్టికి తీసుకు వెళ్లామ‌ని ఫీల‌య్యేవారు. అయితే, ప‌వ‌న్ ఎప్పుడైతే రాజ‌కీయంగా అరంగేట్రం చేశాడో.. ఆయ‌న జ‌గ‌న్ విష‌యంలో రంధ్రాన్వేష‌ణ చేయ‌డం ప్రారంభించాడు. ప్రస్తుతం జ‌గ‌న్ రాజ‌కీయ నాయ‌కుడు.. ఆయ‌న త‌లుచుకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవ‌చ్చు.. పైగా విప‌క్షంలో ఉన్నాడు కాబ‌ట్టి.. ఆయ‌నకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవ‌కాశం ఉంటుంది. మ‌రి వీట‌న్నింటినీ వ‌దిలేసి జ‌గ‌న్ ఎందుకు ఇలా చేస్తున్నాడు. అదే నేనైతే.. ఇలా చేసేవాణ్నికాదు. అని ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. ప్రజాసేవ చేసేందుకు అధికారంలోకే రావాల్సిన అవ‌స‌రం లేద‌ని విరుచుకుప‌డ్డాడు.

డీలింగ్స్ తెగిపోవడంతో…..

క‌ట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబుతో ఉన్న డీలింగ్స్ ప‌వ‌న్‌కు తెగిపోయాయి. అంతేకాదు,. 2014లో తాను మ‌ద్దతిచ్చిన‌ప్పు డు.. ఇప్పుడు.. చంద్రబాబు విశ్వరూపంలో చాలా తేడాలు ఉన్నాయ‌ని గుర్తించారు. విప‌క్షంలో ఉండి కూడా జ‌గ‌న్ ఎన్నిసార్లు ప్రయ‌త్నాలు చేసినా .. క‌నీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వని విష‌యం గుర్తించిన‌ట్టు ఉన్నాడు ప‌వ‌న్‌. అందుకే ఇప్పుడు ప‌వ‌న్‌.. జ‌గ‌న్ బాటలోనే న‌డుస్తున్నాడు. జనసేన అధికారంలోకి రాగానే పారిశుధ్య కార్మికులకు కనీస వేతనంగా రూ.18వేలు అందజేస్తాం. వారికి మంచి వాతావరణంలో గృహాలు నిర్మించి వారి పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తాం. యువతకు నిరుద్యోగ భృతితో పాటు వారికి నచ్చిన అంశాలలో తర్ఫీదునిచ్చి మంచి భవిష్యత్‌ను అంజేస్తాం- అని హామీ ఇచ్చారు. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చివీరికి న్యాయం చేయొచ్చుక‌దా? కానీ. బాబు విశ్వరూపంలోని అస‌లు విష‌యంఇప్పటికి కాని ఆయ‌నకు అర్ధం కాలేదు. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చుకుని ప్లేటు ఫిరాయించాడు ప‌వ‌న్‌!! మొత్తానికి జ‌గ‌న్ బాట‌లోనే అడుగులు వేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*