రాదనుకున్న సీటు వచ్చేలా ఉందే…!!

డీకే ఆదికేశ‌వుల నాయుడు. టీడీపీలో సీనియ‌ర్ మంత్రిగా, వ్యాపార వేత్త‌గా దూకుడు స్వ‌బావంతో వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి. ఆయ‌న ఇప్పుడు లేరు. అయితే, ఆయ‌న స‌తీమ‌ణి స‌త్య‌ప్ర‌భ టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆమె చిత్తూరు అసెంబ్లీ టికెట్‌పై పోటీ చేసి 6 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. రాజ‌కీయ కుటుంబం నుంచి రావ‌డంతో ఇక్క డి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటార‌ని, ముఖ్యంగా ఆదికేశ‌వులు మాదిరిగా ఆమె ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతారని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆమె ఇంటి నుంచి బ‌య‌ట‌కు కాలు క‌దిపితే.. నేరుగా వారి వ్యాపార వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకునేం దుకే వెళ్తున్నార‌నే విమ‌ర్శ‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. ఇక‌, చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కాంగ్రెస్ గ‌తంలో వ‌రుస విజ‌యాలు సాధించింది.

వ్యాపారాలపైనే ఆసక్తి…..

టీడీపీ కేవ‌లం రెండు సార్లు మాత్రం ఇక్క‌డ గెలుపొందింది. దీంతో తిరిగి ఇక్క‌డ టీడీపీ పుంజుకోవాలంటే.. లేదా మ‌ళ్లీ గెలుపు గుర్రం ఎక్కాలంటే.. స్థానిక స‌మ‌స్య‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాలి. అదేస‌మ‌యంలో నిత్యం ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌ల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, స‌త్య‌ప్ర‌భ మాత్రం అలా చేయ‌డం లేదు. ఆదికేశ‌వులు స్తాపించిన కాలేజీలు, విద్యాసంస్థ‌లు, వ్యాపారాల‌ను కాపాడుకోవడంలోను, అభివృద్ధి చేయడంలోనే ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో చిత్తూరులో ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆమె స‌రిగా హాజ‌రుకావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీ కేడ‌ర్ విష‌యానికి వ‌స్తే.. స‌త్య‌ప్ర‌భ వృద్ధురాలు కావ‌డంతో పెద్ద‌గా ఎవ‌రినీ క‌లుపుకొని పోయేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు.

సత్యప్రభను మారుస్తారా…?

ఫ‌లితంగా చిత్తూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో.. ఎక్క‌డా కూడా టీడీపీ నేత‌లు పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లే దు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసిన జంగాల‌ప‌ల్లి శ్రీనివాసులు.. టికెట్ త‌న‌కే ఇస్తార‌ని న‌మ్ముతున్నా రు. ఆయ‌న‌కు ఇక్క‌డ పెద్ద‌గా పోటీకి వ‌స్తున్న నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో నిత్యం ఆయ‌న ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. పార్టీ ప్రారంభించిన న‌వ‌ర‌త్నాలు, పాద‌యాత్ర వంటి కీల‌క విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ సానుభూతి ఓట్లు కూడా ఇప్పుడు స‌త్య‌ప్ర‌భ‌కు ప‌డే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, వైసీపీ నేత‌లు పుంజుకోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టికెట్‌ను వేరేవారికి ఇవ్వ‌డం మంచిద‌నే అభిప్రాయం టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. గ‌తంలో సింగనమల మాజీ ఎమ్మెల్యే శ‌మంత‌క‌మ‌ణి మాదిరిగా స‌త్య‌ప్ర‌భ‌కు కూడా నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చి చిత్తూరు టికెట్‌ను వేరేవారికి ఇవ్వ‌డం మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి బాబు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*