జగన్ కు జై కొడుతున్న తెలుగు తమ్ముళ్లు…!

ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్నాయి. ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. నేత‌లు ఎవ‌రికి వారు త‌మ భ‌విష్యత్తును తీర్చి దిద్దుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా త‌మ‌కు గెలుపు గుర్రంగా భావించే ఏ పార్టీలోకైనా జంప్ చేసేందుకురెడీగా ఉన్నారు. ముఖ్యంగా నిన్న మొన్నటి వ‌ర‌కు అధికార టీడీపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఇప్పుడు అక్కడ మంది ఎక్కువ కావ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భిస్తుందో లేదో అంచ‌నాలు లేక‌పోవ‌డంతో తీవ్రస్తాయిలో తర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. ఈ క్రమంలో ముందుగానే ఇల్లు చ‌క్కబెట్టుకునేం దుకు ప్రయ‌త్నిస్తున్నారు. తాజాగా.. ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉండికూడా త‌మ‌కు గుర్తింపు లేద‌ని భావిస్తున్న నాయ‌కులు.. వెంట‌నే పార్టీ మారేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సీమ జిల్లాల్లో….

తాజాగా ఈ ప‌రిస్థితి సీమ జిల్లాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వైసీపీ నుంచి గెలిచిన నేతలను పార్టీలోకి తీసుకురావడం ప్రధానంగా సిట్టింగుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతలు నాలుగైదు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టిక్కెట్లు వస్తాయన్న నమ్మకం లేని నేతలు.. ఈ గ్రూపు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నవారు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలుస్తోంది. తాజాగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పేరు వార్తల్లో నానుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.

గౌరవం దక్కడం లేదని…..

చంద్రబాబు నాయుడు వద్ద గౌరవం దక్కడం లేదని.. అవమానాలు ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. పలు ఇతర కారణాలూ తోడవడంతో ఆయన టీడీపీని వీడటానికే నిర్ణయించుకు న్నట్టుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లి ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఆయన కూడా టీడీపీని వీడి వైసీపీలోకి చేరనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ విష‌యం తెలియ‌డంతోనే బీసీ జ‌నార్దన్ రెడ్డిని చంద్రబాబు స‌ముదాయించారు. దీంతో ఆయ‌న వైసీపీలోకి వెళ్లకుండా అయితే ప్రస్తుతానికి అడ్డుక‌ట్ట ప‌డింది.

ఇద్దరు ఎమ్మెల్సీలు…..

ఇక వైసీపీ క్షేత్రస్థాయిలో బ‌లంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనూ ఏకంగా ఇద్దరు ఎమ్మెల్సీలు, సీనియ‌ర్ రాజ‌కీయ వేత్తలు అయిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, క‌ర‌ణం బ‌ల‌రాం చూపు కూడా వైసీపీ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో మాగుంట‌కు ఒంగోలు ఎంపీ సీటు, క‌ర‌ణం త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు అద్దంకి అసెంబ్లీ సీటు వైసీపీ ఆఫ‌ర్ చేసే యోచ‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఈ లిస్టులో మ‌రి ఇంకెంత మంది పేర్లు ఉంటాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*