జగన్ ను జనం నమ్ముతున్నారా?

పాత నీరు పోయి కొత్త నీరు వ‌స్తే.. ఉండే ఆనందం వేరేగా ఉంటుంది. అయితే, ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న ఆశ‌ల‌ను స‌జీవం చేసేందుకు వైసీపీ అదినేత జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలిస్తున్నాయి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో జ‌గ‌న్ పెద్ద ఎత్తున పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. దాదాపు ప‌ద‌కొండు నెల‌లుగా ఈ పాద‌యాత్ర నిర్విరామంగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం, రాజ‌న్న రాజ్యాన్ని తిరిగి నెల‌కొల్ప‌డమే ధ్యేయంగా జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల గురించి ప్రజలు స్వాగతిస్తున్నారని ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో పెద్ద ఎత్తున నెటిజ‌న్లు త‌మ అభిప్రాయం చెప్పుకొచ్చారు. ఇది ఒక‌ర‌కంగా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నానికి మద్దతినిచ్చేదిగా ఉందని అంటున్నారు అభిమానులు.

నాన్చుడు ధోరణి సరికాదని…..

రాజ‌కీయాల్లో నాన్చుడు ధోర‌ణిని భ‌రించే శ‌క్తి ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. ఏదైనా మొహం మీదే అడిగేస్తున్నారు. విష‌యాన్ని క‌డిగేస్తున్నారు కూడా! ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దానిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరుకుంటున్న ప్ర‌జ‌ల సంఖ్య పెరుగుతోంది. ఎదురు చూసే ధోర‌ణి కూడా ప్ర‌జ‌ల్లో న‌శిస్తోంది. మ‌రి ఈ స‌మ‌యంలో అధికారంలోకి రావాల‌నుకునేజ‌గ‌న్ వీటిపై వెంట‌నే స్పందించాల‌ని ప్ర‌జ‌లు కోరుకోవ‌డంలో త‌ప్పుకాద‌ని అనిపిస్తోంది. కానీ, జ‌గ‌న్ మాత్రం తాను పరిష్కరిచంగలనని నమ్మకం ఉన్న వాటిపైనే స్పందిస్తున్నారు.

ప్రతి సమస్యపైనా……

ప్ర‌భుత్వంలో తాను లేక‌పోవ‌చ్చు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ప్ర‌భుత్వాన్ని శాసించ‌గ‌ల‌, నిల‌దీయ‌గ‌ల, ప్ర‌శ్నించ‌గ‌ల స‌త్తా ఇప్పుడు జ‌గ‌న్ కు త‌ప్ప రాష్ట్రంలో ఎవ‌రికీ లేదు. విప‌క్ష నేత‌గా ఉన్న ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంది. స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసే అవ‌కాశం ఉంది. పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డి వారికి న్యాయం చేసే అవ‌కాశం కూడా ఉంది. తాను నిర్వ‌హిస్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర స‌భ‌ల్లో వెల్లువెత్తుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందిస్తూనే ఉన్నారు. ప్ర‌తి స‌మ‌స్య‌కూ ప‌రిష్కారం జగన్ వెంటనే చూపలేరు. త‌న ప్ర‌భుత్వ ఏర్పాటుతోనే సాధ్య‌మ‌ని చెబుతున్నారు. దీనిని ప్రజలు స్వాగతిస్తున్నారన్నది ఈ ఆన్ లైన్ సర్వేలో తేలింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత…

విక‌లాంగులు కావొచ్చు, వృద్ధులు కావొచ్చు, ఉద్యోగులు కావొచ్చు. ఎవ‌రు వ‌చ్చి స‌మ‌స్య చెప్పినా.. దానిని త‌న ప్ర‌భుత్వంలోనే ప‌రిష్క‌రిస్తాన‌ని జగన్ చెబుతున్నారు. అంతకు మించి అధికారం లేని జగన్ ఏం చేయగలరని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవ‌ల సీపీఎస్ (కాంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీమ్‌)కి సంబంధించి కొంద‌రు ఉద్యోగులు జ‌గ‌న్‌ను క‌లిశారు. వీరి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వారు కోరారు. అయితే, ఇది కేంద్రం ప‌రిధిలోని అంశం. అదే విషయాన్ని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇలా జగన్ హామీలు, నవరత్నాల వంటివి ఆచరణ సాధ్యమేనన్నది ఎక్కువ మంది నెటిజన్ల అభిప్రాయంగా కన్పిస్తోంది. జగన్ పాదయాత్ర కు వస్తున్న జోష్ కు తోడు ఆయన హామీలు కూడా వర్క్ అవుట్ అవుతున్నాయన్నది ఈ సర్వేలో వెల్లడయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*