జగన్ స్ట్రాంగ్ గా బాబుకు …!!

ysjaganmohanreddy vs pawan kalyan

శ్రీకాకుళం లో తుఫాన్ ధాటికి అతలాకుతలం అయితే విపక్షనేత పక్క జిల్లాలో పాదయాత్రలో ఉన్నా పరామర్శకు రాలేదన్న విమర్శలు వైఎస్ జగన్ ఉప్పెనలా చుట్టుముట్టాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఏమాత్రం గ్యాప్ లేకుండా జగన్ ను విమర్శించడంపై గట్టిగా దృష్టి పెట్టి మరీ తిట్టి పోస్తున్నా జగన్ నుంచి రిప్లై లేదు. కానీ తాజాగా విజయనగరం జిల్లా సాలూరు లో తనపై వచ్చిన విమర్శలను, ఆరోపణలను ధాటిగా తిప్పికొట్టారు జగన్. 10 రోజులు సమయం ఇస్తున్నా తుఫాన్ బాధితులను ఆదుకోండి. లేకపోతే నే వస్తున్నా 50 రోజులు ఉంటా ప్రతి ఊరూ పర్యటిస్తా. మీ సంగతి తేల్చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు విపక్ష నేత.

ఇదే జగన్ హెచ్చరిక …

తుఫాన్ బాధితులను చంద్రబాబు ఆదుకుంటున్న తీరును తూర్పారబట్టారు వైసిపి అధినేత. కేవలం రెండు వందల రూపాయల సరుకులు ఇచ్చి ప్రచారం మాత్రం గట్టిగా చేసుకుంటున్నారని విమర్శించారు. 65 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లిన హుదుహుద్ తుఫాన్ కి కేంద్రం ఇచ్చిన సొమ్ముతో కలిపి వెయ్యికోట్ల రూపాయల లోపేనని, 3345 కోట్ల రూపాయల నష్టం తెచ్చిన శ్రీకాకుళం లోని తుఫాన్ కి నామ మాత్రం ఖర్చు మాత్రమే చేశారని ఎద్దేవా చేశారు జగన్. ప్రస్తుత ప్రభుత్వం బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాకపోతే తాము అధికారం లోకి వస్తే పూర్తిగా నష్టం భర్తీ చేస్తామని అభయ హస్తం ఇచ్చారు జగన్.

నా చేతిలో ఏముంది …?

జగన్ రాలేదు… రాలేదు అంటున్నారు. మా పార్టీ బృందాలు వస్తే సహాయ కార్యక్రమాలు అడ్డుకున్నామని అంటున్నారు. టిడిపి రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తుందని దుమ్మెత్తిపోశారు. జగన్ వస్తే ఏమి జరుగుతుందని అదే అధికారం ముఖ్యమంత్రి చేతిలో ఉందని బాధితులను ఆదుకోవాలిసిన బాధ్యత సిఎం దే అన్నారు ఆయన. సిఎం నువ్వా నేనా ?, ఖజానా నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా ?, అధికార యంత్రాంగం నా ఆదేశాలు పాటిస్తుందా నీ ఆదేశాలు పాటిస్తుందా ? అంటూ నిప్పులు చెరిగారు జగన్.

బొబ్బిలి రాజుల గాలి తీసిన జగన్ …

సాలూరు సభలో జగన్ బొబ్బిలి రాజుల గాలి తీసేసారు. వైసిపి లో గెలిచి టిడిపి లో చేరిన సుజయ కృష్ణ రంగారావు పై విరుచుకుపడ్డారు జగన్. మంచి ఆఫర్ వచ్చినా తాను గెలిచిన పార్టీకి ద్రోహం చేయనని నిలబడ్డ స్థానిక ఎమ్యెల్యే రాజన్నదొర క్యారెక్టర్ చాలా గొప్పదన్నారు జగన్. అదే పక్కనే వున్న బొబ్బిలి రాజా సంతలో పశువు మాదిరి అమ్ముడు పోయారని రాజన్నదొరకు వున్న క్యారెక్టర్ వారికి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. సాలూరు సభలో వేలసంఖ్యలో ప్రజాసంకల్ప యాత్ర సభకు ప్రజలు హాజరు కావడంతో జోరు పెంచి జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*