జగన్ ను ఎంత తిడితే అంతగా…???

రాజ‌కీయాల్లో నేత‌ల వ్యాఖ్య‌లే సంచ‌ల‌నం సృష్టిస్తాయి. స‌మ‌స్య‌ల‌కు కూడా దారితీస్తాయి. ఇప్పుడు జగన్ పై దాడి ఎపిసోడ్‌లో టీడీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు.. కూడా ఇలానే ఆ పార్టీకి స‌మ‌స్య‌లుగా మారుతున్నాయి. విశాఖ ప‌ట్నం ఎపిసోడ్‌లో జ‌గ‌న్‌ను ఇరికించేందుకు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్లాన్ చేశార‌నేది అర్ధ‌మ‌వుతున్న విష‌యం. ఏకంగా ఓ విప‌క్ష నాయ‌కుడిపై జ‌రిగిన హ‌త్యా య‌త్నాన్ని త‌క్కువ చేసి చూపించేందుకు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు జ‌గ‌న్‌ను ఈ రాష్ట్ర ద్రోహిగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏ మంత్రి అయినా మీడియా ముందుకు వ‌చ్చి.. జ‌గ‌న్‌ను దూషించ‌కుండా ఉండ‌లేక పోతున్నారు. రాష్ట్ర పోలీసుల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

సాధారణ ప్రజల్లోనూ…..

జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు విచార‌ణకు సంబంధించి ఏపీ పోలీసుల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అయితే, దీనిని త‌ప్పుప‌ట్ట‌డాన్ని ఎవ‌రూ కాద‌నరు. కానీ, ఏకంగా రాష్ట్ర ద్రోహిగా.. లేదా ఇక్క‌డ అసలు పోటీ చేసే అర్హ‌త లేద‌న్న‌ట్టుగా టీడీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు చంద్ర‌బాబుకు కూడా వ‌ర్తిస్తాయ‌ని అంటున్నారు సాధార‌ణ ప్ర‌జ‌లు. నిజానికి జ‌గ‌న్ విష‌యాన్ని చూద్దాం. ఆయ‌న ఏపీ పోలీసుల‌పై న‌మ్మ‌కం లేద‌ని అన్నారు. ఆయ‌న మ‌న‌సులో ఏమున్నా.. కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ ఇదే భావం ఉంద‌నడంలో సందేహం లేదు. దీనికి ప్ర‌ధానంగా రెండు మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. ప్ర‌జాప్ర‌తినిధి, గిరిజ‌న ఎమ్మెల్యే స‌ర్వేశ్వ‌ర‌రావును మావోయిస్టులు హ‌త్య చేశారు.

తెలంగాణ ఎన్నికల సంఘం సయితం…

ఇక‌, టీడీపీనే లోకంగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎమ్మెల్యే సోమాను కూడా మావోయిస్టులు హ‌త్య చేశారు. మ‌రి ఏపీ పోలీసులు ప‌టిష్టంగా ఉంటే.. 60 మందికి పైగా మావోయిస్టులు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి చెందిన ప‌ర్యాట‌క ప్రాంతం అర‌కులో తిష్ట‌వేసి వీటిని ఎలా చేశారు? ఇక‌, తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ఏపీ పోలీసులు మాకు వ‌ద్దు! వారిపై న‌మ్మ‌కం లేదు! అని వ్యాఖ్యానించింది. దీనిని ఎలా చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రువు హ‌త్య‌లు, అత్యాచారాలు వంటి వాటిని నిలువ‌రించ‌లేక పోతున్న పోలీసులు ఎలా స‌మాధానం చెబుతారు? ఆర్టీజీ వంటి వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంద‌ని, రాష్ట్రంలో ఏమూల ఏం జ‌రుగుతోందో అమ‌రావ‌తిలో కూర్చుని తెలుసుకుంటాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు మ‌రి ఇంత పెద్ద ఘ‌ట‌న‌ల‌ను ఎందుకు ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారు? అనేది కూడా ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం.

బాబు కేంద్రంపై కామెంట్స్…..

ఇక‌, మ‌రో ముఖ్య విష‌యం కూడా చంద్ర‌బాబును ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో పోలీసుల‌పై న‌మ్మ‌కం లేద‌ని చెబుతున్న జ‌గ‌న్‌కు రాష్ట్రంలో ప‌ర్య‌టించే అర్హ‌త లేద‌ని చెబుతున్న టీడీపీ నేత‌లు.. మ‌రి బాబు.. కేంద్రంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌పైనా త‌న‌కు న‌మ్మ‌కం పోయింద‌ని, సీబీఐ, ఈడీ, ఐటీ అధ‌కారులు ద్రోహులు అన్న విధంగా కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఆయ‌న కేంద్రంలో ఎలా చ‌క్రంతి ప్పుతారు? అనేదానికి స‌మాధానం కావాల‌ని అడుగుతున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీలో లేకుండా చూసుకుని ప్రెస్ మీట్ లు పెట్టే చంద్ర‌బాబు.. కేంద్రంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు ఘోరంగా విఫ‌ల‌మైనప్పుడు కేంద్రంలో ఎలా చ‌క్రం తిప్పుతారో కూడా చెప్పాలి. ఏదైనా మ‌నం అనేస్తే.. ప్ర‌జ‌లు న‌మ్మేస్తారు. అనుకుంటే పొర‌పాటే అంటున్నారు విశ్లేష‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*