డేట్ ఫిక్స్ అయ్యింది… జగన్….?

వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నం తరువాత ఆయన సుదీర్ఘ పాదయాత్రకు బ్రేక్ పడింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో విశ్రాంతిలో ఉండిపోయారు జగన్. ఆయన పాదయాత్ర దీపావళి అనంతరం ప్రారంభిద్దామని భావించినా మరికొద్ది రోజులు విశ్రాంతి అవసరమన్న సూచనలతో వెనక్కి తగ్గారు జగన్. ఈనెల 12 నుంచి తిరిగి తన యాత్ర ఎక్కడ ఆపారో ఉత్తరాంధ్రలో అక్కడినుంచే మొదలు పెట్టనున్నారు వైసిపి చీఫ్. విశాఖలో కోడి కత్తి దాడి తరువాత జగన్ కి వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే.

ఆ సీన్ లు ఇక కనపడవా …!!

విశాఖ దాడి తరువాత విపక్ష నేతకు భారీ భద్రతను కల్పించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ మధ్యలో ఆయన వుంటారు. జగన్ ను వ్యక్తిగతంగా ఎవరు కలవాలన్నా పోలీసుల పూర్తి తనిఖీ తరువాతే ఆయన అనుమతితో కలవాలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకం అయ్యి ఇప్పటివరకు సాగిన ప్రజాసంకల్ప పాదయాత్ర కు భద్రత అడ్డు గోడగా ఏర్పడనుంది. జగన్ ప్రతివారినీ దగ్గరకు తీసుకుని పలకరించడం లేదా ప్రజలు చాలామంది ఆయన్ను ఆలింగనాలు చేసుకోవడం వంటి సీన్ లు ఇకపై కానరాకపోవొచ్చు.

రెండు నెలల పాటు….

వేలమంది ప్రజల మధ్యలో సాగే ఈ యాత్రలో మరిన్ని జాగ్రత్తలు అవసరమన్న ఆలోచనతో ఖాకీ బాస్ లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పూర్తి అయితే శ్రీకాకుళం జిల్లా పాదయాత్రతో వైసిపి అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగుస్తుంది. తుఫాన్ దెబ్బకు విలవిల్లాడిన శ్రీకాకుళం జిల్లాలో దాదాపు రెండు నెలలపాటు ప్రతి ఊరిని విడవకుండా చుట్టి రావాలని జగన్ సంకల్పించారు. దాంతో డిసెంబర్ చివరి వారం కానీ జనవరిలో కానీ ఆయన సుదీర్ఘ పాదయాత్ర పూర్తి కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*