జగన్ కు అక్కడ మాత్రం ఇబ్బందే…!!!

వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం సుదీర్ఘ‌మైన ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పుల్లో తలమున‌కలైన జగన్‌కు ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఈ రెండు జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. ఉభయగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతున్నా సెట్‌ కావడం లేదు. ఇదిలా ఉంటే ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన, పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలోని మూడు ఎంపీ సెగ్మెంట్ల నుంచి వైసీపీకి బ‌ల‌మైన అభ్యర్థులు దొరకని పరిస్థితి.

కాకినాడ పార్లమెంటుకు….

జిల్లా కేంద్రం అయిన కాకినాడలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్‌ జనసేన నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాకినాడ సీటు సంగతి పక్కన పెడితే రాజమహేంద్రవరం సీటు నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడతానని జగన్‌ కొద్ది రోజుల క్రిందట ప్రకటన చేశారు. ఈ సీటు నుంచి మాజీ మంత్రి, బీసీ నేత అయిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను పోటీ చేయించాలని జగన్‌ అనుకున్నాడు. పిల్లి ఆర్థికంగా వీక్‌గా ఉండడంతో ఇప్పుడు రాజమహేంద్రవరంకు చెందిన వ్యాపారి మారగాని నాగేశ్వరరావు కుటుంబం వైసీపీలో చేరింది. ఆయనకుమారుడు భరత్ కు సీటు కన్ఫ్మర్మ్ చేశారు జగన్. వాస్తవంగా చూస్తే రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ చాలా బలంగా ఉంది.

అమలాపురంలో….

ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి మురళీ మోహన్‌ పోటీ చేసినా లేదా ఇతరులు ఎవరు పోటీ చేసినా ఆర్థికంగా అన్ని విధాల బలమైన అభ్యర్థులే రంగంలో ఉంటారు. జగన్‌ ఇక్కడ వీరిని ఢీ కొట్టేలా బలమైన అభ్యర్థిని అన్ని ఈక్వేషన్లలో బేరీజు వేసుకుని దింపారు. జిల్లాలోని కీలక ఎంపీ సీట్లు అయిన కాకినాడలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే కోనసీమలో ఉన్న రిజర్వ్‌డ్‌ లోక్‌సభ సీటు అయిన అమలాపురంలో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. ఆయన అమలాపురం నుంచి అసెంబ్లీ రేసులోతన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. దీంతో అమలాపురంలో సైతం వైసీపీకి అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి.

వీరిద్దరికీ ధీటైన అభ్యర్థిని……

అమలాపురంలో టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ పీ. రవింద్రబాబు ఉన్నా ఇంకా బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోంది. దివంగత మాజీ లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ. బాలయోగి తనయుడు హరీష్‌ పేరు ఇక్కడ టీడీపీ నుంచి ఇక్కడ బలంగా వినిపిస్తోంది. అదే టైమ్‌లో జనసేన నుంచి మాజీ ఎంపీ హర్ష కుమార్‌ రేసులో ఉంటారని టాక్‌. మరి వీరిద్దరిని ఢీ కొట్టేలా ఇక్కడ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి రేసులో ఉంటేనే తప్పా వైసీపీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనా ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన, అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి సరైన అభ్యర్థులు లేకపోవటం బట్టీ చూస్తే జనం ఇక్కడ భారీ ఎత్తున పోస్ట్‌మార్టం చెయ్యాల్సిందే అని అనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*