జగన్ భయపడుతున్నాడంటూ….!

భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ రాజకీయాలు నడుపుతున్నారన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. లాలూచీ రాజకీయాలు చేస్తూ జగన్ తన కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, జగన్ కేసుల విచారణ వేగంగా ఎందుకు జరగడం లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో కేంద్రాన్ని సూటీగా ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం తాము బీజేపీ, కాంగ్రెస్ లకు సమానదూరంగా ఉంటామని, రాష్ట్రంలో తమకు ప్రధాన శత్రువు టీడీపీయేనని వైసీపీ చెబుతోంది.

అమిత్ షా వార్నింగ్ ఇచ్చారంటూ….

కొన్నాళ్ల క్రితం ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరాలనుకున్నారు. ఆయన అందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కాని కన్నా చివరి నిమిషంలో కన్నా మనసు మార్చుకున్నారు. వైసీపీలోకి వెళ్లకుండా భారతీయ జనతాపార్టీలోనే ఉండి పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే కన్నా విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారన్ని విపరీతంగా చేశారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎలా సాగిందంటే విపరీతంగా. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారని, అందుకే కన్నాను చేర్చుకోలేదని ప్రచారాన్ని విపరీతంగా సాగించారు.

కన్నా విషయంలో మాత్రం……

అయితే కన్నాచివరి నిమిషంలో డ్రాప్ అవ్వడానికి కారణం అమిత్ షాయే. అందులో వాస్తవముంది. ఏపీలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం, కన్నా ఆ సామాజికవర్గంలో బలమైన నేత కావడంతోనే అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి మరీ పార్టీని వీడొద్దని, ఉన్నత పదవి ఇస్తామని చెప్పడంతోనే కన్నా ఆగిపోయారు. కన్నా బీజేపీలో ఉండటానికి కారణం అమిత్ షా యే అయినా…జగన్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే రాను రాను బీజేపీ నేతలు సయితం కొందరు పార్టీలో చేరుతుండటాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

మరి ఈ ఇద్దరో…….

ఇటీవల బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. పాణ్యం నియోజకవర్గానికి చెందిన కాటసాని బీజేపీని వీడినా అధిష్టానంకూడా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే తాజాగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీ నేతే. మూడేళ్ల నుంచి బీజేపీలో ఆయన చురుగ్గానే పాల్గొంటున్నారు. అయితే తాజాగా రామ్ కుమార్ రెడ్డి బీజేపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. అయినా బీజేపీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా మరికొందరు బీజేపీ నేతలు కూడా వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారట. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమేనని, సత్తా ఉన్న నేతలు ఎవరొచ్చినా తమ పార్టీలో చేర్చుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా బీజేపీ నేతలను వైసీపీలోచేర్చుకునేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారానికి ఈ విధంగా చెక్ పెడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*