జగన్ ఆయన్ను తప్పించేటట్లున్నారే‌.. !

రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లా వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. నిన్నటివరుకు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగానూ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌ను అనూహ్యంగా త‌ప్పించిన ఆ పార్టీ అధిష్టానం పార్టీ సభ్యత్వం కూడా లేకుండా ఇటీవల పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన విడదల రజినీకుమారి ఎన్నారై అనే మహిళకు చిలకలూరిపేట పార్టీ ప‌గ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ నాయ‌కుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు వ‌స్తుందా ? లేదా ? అన్న సందేహాలు ముసురుకున్నాయి. వెస్ట్‌ నియోజకవర్గ వైసీపీకి సమన్వయకర్తగా ఉన్న లేళ్ల‌ అప్పిరెడ్డికి కూడా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో లేదో అన్నా టెన్షన్‌ స్టార్ట్ అయ్యినట్టు గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయవర్గంలో ప్రచారం జరుగుతుంది.

వైఎస్ అనుచరుడిగా…..

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుచరుడిగా ఉన్న అప్పిరెడ్డికి రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర స్థాయిలో పేరున్న గుంటూరు మిర్చియార్డ్‌ చైర్మ‌న్‌గా ఛాన్స్‌ ఇచ్చారు. రాజశేఖర్‌రెడ్డి మరణంతరం ఆయన తనయుడు జగన్‌ స్థాపించిన వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన అప్పిరెడ్డికి జగన్‌ గత ఎన్నికల్లో చివరిక్షణంలో గుంటూరు వెస్ట్‌ వైసీపీ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లో అప్పిరెడ్డి టీడీపీనుంచి పోటి చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి గట్టి పోటి ఇవ్వలేక ఎన్నికల ముందే చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్‌ టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై పార్టీ పరంగా ఇటు పార్టీలోనూ, అటు నియోజకవర్గప్రజల్లోనూ తీవ్రమైన వ్యతిరేకం వ్యక్తం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మోదుగుల ఇక్కడ పోటి చేస్తే చిత్తు చిత్తుగా ఓడిపోవడం కాయమని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

మోదుగుల సీటు మార్చినా……

ఈ క్రమంలోనే మోదుగులం మాచర్ల లేదా నరసారావుపేట ఎంపీగా వెళ్లిపోవాలని అనుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్నప్పుడు అదే క్రమంలో నియోజకవర్గంలో వైసీపీకి అనుకూల సంకేతాలు ఉన్నాయంటే లేవనే అర్థమౌతుంది. ఇందుకు కారణం లేళ్ల‌ అప్పిరెడ్డి వ్యవహారశైలే అనీ వైసీపీలోనే చర్చ నడుస్తుంది. అప్పిరెడ్డి వ్యవహారశైలితో పాటు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో అప్పిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో వెస్ట్‌ సీటు వస్తుందా రాదా అన్న‌ది సందేహంగా మారింది. జిల్లాల్లో ప్రస్తుతం కాపు సామాజికవర్గాల నుంచి వైసీపీలో సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పెదకూర‌పాడులో కావటి మనోహర్‌ నాయుడు తాజాగా చిలకలూరిపేటలో విడదల రజినీకుమారి (భ‌ర్త కాపు) నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నారు. జిల్లాల్లో కాపుసామాజికవర్గం నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులు (న‌ర‌సారావుపేట లోక్‌సభ సెగ్మెంట్‌లోనే ముగ్గురూ ) ఉన్నా… వచ్చే ఎన్నికల్లో పెదకూర‌పాడు నుంచి ప్రస్తుతం ఇన్‌చార్జీగా ఉన్నా కావటి మనోహర్‌నాయుడు అక్కడ అంత బలమైన అభ్యర్ధి కాకపోవడంతో ఆయనను తప్పించి మరో వ్య‌క్తిని పోటీ చేయించే దిశగా జగన్‌ ఆలోచన చేస్తున్నటు తెలుస్తుంది.

కాపు సామాజిక వర్గానికి చెందిన….

పెదకూర‌పాడు సీటును కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వాలని జగన్‌ నిర్ణయం తీసుకున్న‌ట్టు కూడా ప్రాథ‌మిక స‌మాచారం. ఈ క్ర‌మంలోనే గుంటూరు వెస్ట్‌ సీట్‌ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని దించితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచ‌న పార్టీలో జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఓ సీనియర్‌ లీడర్‌గా ఉన్న ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు కిలారు వెంక‌ట రోశ‌య్య పేరు ఇక్క‌డ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. జిల్లా వైసీపీలో ఇప్పటికే మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి, మాచర్ల నుంచి పిన్మెల్లి రామకృష్ణారెడ్డి, నరసారావుపేట నుంచి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండగా గురజాలలో కాసు మహేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అలాగే నరసారావుపేట ఎంపీగా ఆళ్ల‌ అయోధ్య రామిరెడ్డి మరో సారి బరిలోకి (ఆయ‌న్ను మారిస్తే మ‌రో రెడ్డి ) దిగనున్నారు. రెడ్డి సామాజకవర్గానికి ఇప్పటికే ఐదు సీట్లు కేటాయించడంతో లేళ్ల‌ అప్పిరెడ్డిని తప్పిస్తార‌న్న‌ ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సీటును కాపులకు ఇచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ ఈక్వేషన్ల పరంగా చూస్తే లేళ్ల‌ అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్‌ సీటుపై ఆశలు వదులుకోవల్సిందేనా అన్నది క్లీయ‌ర్‌గా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*