జగన్ కు జబర్దస్త్ ఛాన్స్….!

వైసీపీ అధినేత జగన్ కు మంచి ఛాన్స్ దక్కింది. ఉప ఎన్నికలు వస్తే తన సత్తా చాటుకోవడానికి మరో అవకాశం లభించింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు నెరుపుతున్నారన్న తెలుగుదేశం పార్టీ విమర్శలకు చెక్ పెట్టనున్నారు జగన్. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికి చెందిన పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదించడంతో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయని తెలుస్తోంది. ఇటీవలే కర్ణాటకలో యడ్యూరప్ప, బి.శ్రీరాములు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానాలకు రాజీనామా చేయడంతో వాటిని ఎప్పుడో ఆమోదించారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన సుమిత్రా మహాజన్ ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదించడంతో కర్ణాటక స్థానాలతో పాటు వీటికి కూడా ఉప ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది.

ఉప ఎన్నికలు వచ్చినా…రాకున్నా….

అయితే ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయించాల్సిన అంశం కాబట్టి స్పష్టత లేకున్నా ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధం కావాల్సిందే. కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నయి. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. రాజీనామాల అంశం తెలిసిన వెంటనే అందుబాటులో ఉన్న నేతలు జగన్ ను కలిశారని తెలుస్తోంది. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నికలు జరగకపోయినా తాము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని ప్రజలు విశ్వసిస్తారని ఆ పార్టీ భావిస్తోంది.

బస్సుయాత్రకు శ్రీకారం…..

వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంతో పార్టీకి మరింత హైప్ వస్తుందని ఈ సందర్భంగా జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. లోటస్ పాండ్ లో కీలకనేతలతో సమావేశమైన రాజీనామాలు చేసిన ఎంపీలతో బస్సుయాత్ర చేయించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా సమయం ఉంది కాబట్టి ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర ద్వారా ప్రత్యేక హోదా కోసం పదవులను త్యాగం చేసిన ఎంపీలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బస్సుయాత్రపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కట్టుబడి ఉన్నామని…..

తొలినుంచి ప్రత్యేక హోదా కోసం తామే పోరాడుతున్నామని, నాలుగేళ్ల నుంచి దీక్షలు, యువభేరిల పేరుతో ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాని తెలుగుదేశం పార్టీ యే ఒకసారి ప్రత్యేక ప్యాకేజీ అని, మరొకసారి ప్రత్యేక హోదా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించారని వైసీపీ ఇక ప్రజల్లోకి వెళ్లనుంది. ప్రజాభిప్రాయం ప్రకారమే తాము రాజీనామాలు చేశామని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ప్రత్యేకహోదా సాధన సాధ్యమయ్యేదని ప్రజలకు వివరించనున్నారు. ఇక సెంటిమెంట్ తో ప్రజల్లోకి ఎంపీలను పంపాలని వైసీపీ నిర్ణయించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*