ఇక్కడ జగన్ సెలక్షన్ పర్ ఫెక్షన్ గా ఉండాలి .. !

ఏపీలో ఎన్నికల హీట్‌ స్టాట్‌ అవ్వడంతో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటే మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న‌ నియోజకవర్గాల్లో సైతం కొత్తగా పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నవారు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఎలా ఎర్త్‌ పెట్టాలా ? అనే ప్లాన్లు వేస్తునారు. విపక్ష వైసీపీ నుంచి చాలా నియోజకవర్గాలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు ఎదురౌతున్నాయి.

ఒకరికి ముగ్గురు…..

అయితే పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో మాత్రం కొన్ని కీలక నియోకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు మగ్గురు కీలక నేతలు పోటీ పడుతుండడంతో అసలు ఫైనల్‌గా టికెట్‌ ఎవరికి వస్తుందనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఇందుకు ఉదాహరణే నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం.ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొమ్మి లక్ష్మ‌య్య‌నాయుడు టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల‌ రామకృష్ణ చేతిలో ఓడిపోయారు. లక్ష్మ‌య్య నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో జగన్‌ ఇక్కడ పార్టీ పగ్గాలను జడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి అప్పగించారు.

బొమ్మిరెడ్డి నేనంటూ….

నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా భాధ్యతలు తీసుకున్న ఆయన గత మూడేళ్లగా పార్టీని నియోజకవర్గంలో ముందుండి నడిపిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనకు బంధువర్గం ఉండడంతో టికెట్‌ రేసులో ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి తనే పోటీ చేసి గెలవచ్చని ఆశించారు. అయితే అదే టైమ్‌లో ఆయనకు పోటీగా కలిమిలి రామ్‌ప్రసాద్‌ రెడ్డి సైతం సేవా కార్యక్రామాలు నిర్వహిస్తూ తాను సైతం టికెట్‌ రేసులో ఉన్నానని దూసుకు వచ్చారు. వీరిద్దరి మధ్య పోటీ ఇలా ఉండగా దివంగత మాజీ ముఖ్య మంత్రి నేదురుమిల్లి జనార్థ‌న్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి బీజేపీ నుంచి ఇటీవల వైసీపీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.

ఆనం…రామ్ కుమార్ రెడ్డి…..

ఈ మూడు ముక్కలాట ఇలా ఉండగా జిల్లాల్లో బలమైన నేపథ్యం ఉన్న‌ మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి తాజాగా వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు వెంకటగిరి టికెట్ ఖ‌రారు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ట్విస్ట్ ఏంటంటే నిన్నటివరకూ ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డిలు ఇప్పుడు ఒక్కటి అయ్యారు. వీరిద్దరు కలిసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి కీలక నేతలుగా వైసీపీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి వైసీపీ టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*