జోష్ పెంచిన జగన్….!!!

y.s.jaganmohan reddy ysrcongress party Telugu News Andhra Pradesh News

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ పోరు రాజుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు ఇక్క‌డ ఏక‌ప‌క్షంగా ఉన్న రాజ‌కీయ వ్యూహం.. ఇప్పుడు వైసీపీ తీసుకున్న యూట‌ర్న్‌తో పూర్తిగా మారిపోయింది. పెద‌కూర‌పాడులో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీ నాయ‌కుడు కొమ్మ‌ల‌పాటి శ్రీధ‌ర్‌. 2009, 2014లోనూ ఆయ‌న విజ‌యాలు సాధించారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీధ‌ర్‌.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌నే బాగానే ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా అబివృద్ధి ధ్యేయంగా ఆయ‌న దూసుకుపోతున్నారు. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆయ‌నకు అభిమానం మెండుగానే ఉంది. మ‌రో నాలుగైదు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న త‌న స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. స్థానికంగా శ్రీధ‌ర్‌కు మంచి ప‌ట్టు ఉండ‌డంతో చంద్ర‌బాబు సైతం టికెట్ విష‌యంలో ఇప్ప‌టికే శ్రీధ‌ర్‌కు క్లారిటీ ఇచ్చిన‌ట్టే తెలుస్తోంది.

జగన్ జాగ్రత్త పడి….

దీంతో మ‌ళ్లీ కొమ్మాల‌పాటికే టికెట్ ద‌క్కుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీధ‌ర్‌కు ఉన్న అన్ని ప్ల‌స్‌లు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో యూట‌ర్న్ తీసుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌రకు ఇక్క‌డ వైసీపీకి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుగా కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడు వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. అయిన‌ప్ప‌టికీ కొమ్మాల‌పాటికి చెక్ పెట్టేలా కొంత‌మేరకు రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చారు. అయితే, క‌మ్మ సామాజిక వ‌ర్గం కావ‌టికి దూరంగా ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న గ్ర‌హించారు. దీంతో ఇప్పుడు ఎన్నిక‌లకు నాలుగు మాసాల ముందు జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

హోరా హోరీ పోరు….

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టికెట్ ఇచ్చేలా నంబూరు శంక‌ర్రావును రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించారు. దీంతో వెంట‌నే ఆయ‌న‌కు పెద‌కూర‌పాడు ఇంచార్జ్ ప‌ద‌విని అప్ప‌గించారు. కావ‌టి కొమ్మాల‌పాటికి ఎంత మాత్రం పోటీ ఇవ్వ‌లేదు. ఇక్క‌డ తిరిగి కొమ్మాల‌పాటి హ్యాట్రిక్ షురూయే అని అంద‌రూ భావించారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెద‌కూర‌పాడుపై ఉన్న అంచ‌నాలు అన్నీ కూడా ప‌ఠాపంచ‌ల‌య్యాయి. ఒక్క‌సారిగా అటు అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి, ఇప్పుడు వైసీపీ ఇంచార్జుగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నంబూరు శంక‌ర్రావుకు మ‌ధ్య హోరా హోరీ పోరు సాగే సూచ‌న‌లు క‌నిపిస్తు న్నాయి.

సిట్టింగ్ పై వ్యతిరేకత….

క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనే.. కొమ్మాల‌పాటిని వ్య‌తిరేకించే.. వ‌ర్గం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌ట‌స్థంగా ఉంది. అయితే, ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగిన నంబూరుతో ఈ వ‌ర్గం ట‌చ్‌లోకి వ‌స్త‌సుంద‌ని,దీంతో కొమ్మాల‌పాటికి ఈ వ‌ర్గం ఓట్లు చీలితే ఇబ్బందే అని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా. మ‌రోప‌క్క‌, ఇక్క‌డ గ‌త రెండుసార్లుగా కూడాటీడీపీ గెలుస్తుండ‌డం, గ‌త నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త ఉంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ్యాపించింద‌ని, ఫ‌లితంగా ఇక్క‌డ కోట్ల రూపాల‌య అవినీతి జ‌రుగుతోంద‌ని గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్న స‌మ‌చారం. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడు వైసీపీకి దొరికితే.. కొమ్మాల‌పాటికి పోరు జోరు త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం.. శంక‌ర్రావు నియామ‌కం.. కొమ్మాల‌పాటి శిబిరంలో వేడి పెంచుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*