జ‌గ‌న్ బుజ్జ‌గించినా…. ఆ వైసీపీ లీడ‌ర్…??

లేళ్ల అప్పిరెడ్డి. గుంటూరు జిల్లా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ (ప్ర‌స్తుతం వ‌డ్డెర ఏసుర‌త్నానికి ఇచ్చా రు). 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసిన లేళ్ల అప్పిరెడ్డి పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఆయన అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు. పార్టీ నిర్దేశించిన కార్యక్ర మాలు చేసుకుపోయారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నాలుగు పర్యాయాలు పాదయాత్ర ద్వారా నియోజక వర్గాన్ని చుట్టివచ్చిన నేతగా అప్పిరెడ్డికి పేరుంది. వీటన్నింటినీ మించి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డికి అప్పిరెడ్డి శిష్యుడు. వైఎస్ టైంలో ఆయ‌న ఆసియాలోనే పెద్ద‌ది అయిన గుంటూరు మిర్చి యార్డు చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు.

తాజాగా లేళ్లను తప్పించి….

అనంతర కాలంలో జగన్‌కు ఆయన సన్నిహితమయ్యారు. తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ లోనే ఉంటూ వచ్చారు. తాజాగా గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఇవ్వలేననీ, అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పదవి ఇస్తాననీ లేళ్ల‌కు జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డం తెలిసిందే. అదే స‌మ‌యంలో మాజీ పోలీసు అధికారి చంద్ర‌గిరి ఏసుర‌త్నాన్ని గుంటూరు ప‌శ్చిమలో పోటీకి పెడుతున్నట్టు కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న అనంతం అప్పిరెడ్డి అనుచ‌రులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హావేశాలు వెళ్ల‌గ‌క్కారు. కానీ, లేళ్ల సూచ‌న‌ల‌తో వారు ఆగారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ దూత‌గా రంగంలోకి దిగిన విజ‌య‌సాయి రెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్ల‌న్నీ ఏసు ర‌త్నానికే ప‌డేలా చేయాల‌ని అప్పిరెడ్డికి సూచించారు.

అనుచరుల వత్తిడితో ….

ఏసుర‌త్నాన్ని గెలిపించే బాధ్య‌త‌ను జ‌గ‌న్ .. నీ చేతిలో పెట్ట‌మ‌న్నారు. మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక నీకు మంత్రి ప‌ద‌వి ఖాయం! అని విజ‌య‌సాయి చెప్పారు. అయితే, తొలుత దీనికి ఓకే అన్న అప్పిరెడ్డి.. గడిచిన రెండు రోజులుగా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప‌క్క కుటుంబ స‌భ్యులు, మ‌రోప‌క్క‌,పార్టీ అనుచ‌రులు కూడా అప్పిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేదు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి తీవ్ర వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఈ క్ర‌మంలో రెడ్డి సామాజిక ఓట్లు స‌హా వివిధ వ‌ర్గాల ఓట్లు కూడా మీకు ప‌డ‌తాయి. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశంవ‌దులుకుంటే ఎలా? అని కుటుంబ స‌భ్యుల నుంచి లేళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది.

మరోసారి జగన్ తో మాట్లాడి….

ఇక‌, ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌కు పార్టీ అనుచ‌రులు మ‌రో హిత‌బోధ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంతంత మాత్రంగానే ఉంద‌ని లేళ్ల అనుచ‌రులు అంచ‌నా వేస్తున్నార‌ట‌. వైసీపీ గెలిచి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తేనే క‌దా.,. నీకు ఏదైనా ప‌ద‌వి వ‌చ్చేది. కానీ, ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఎలా మారుతుందో ఎవ‌రు మాత్రం చెప్ప‌గ‌ల‌రు. సో.. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకో! అని స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. దీంతో లేళ్ల త‌న నిర్ణ‌యంపై మ‌ళ్లీ త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతున్నార‌ని, దీనిపై మ‌రోసారి నేరుగా జ‌గ‌న్‌తోనే ఆయ‌న మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అంటున్నారు. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*