గురుశిష్యులకు జగన్ షాక్.!!

ys jaganmohanreddy senior leaders

విజయనగరం జిల్లా రాజకీయాల్లో గురు శిష్యులిద్దరికీ షాకులు తగులుతున్నాయి. వైసీపీలో ఉన్న గురువు పెనుమత్స సాంబశివరాజు, శిష్యుడు బొత్స సత్యనారాయణ ఇద్దరి పరిస్థితి ఇపుడు ఒకేలా ఉంది. జగన్ తనదైన మార్కు పాలిటిక్స్ తో ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకుంటున్న విషయాలతో పాటు, సొంత సర్వేలు సైతం జగన్ ప్రతి అసెంబ్లీ సీటు విషయంలో సీరియస్ గా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెల్లిమర్ల సీటుని ఆశిస్తున్న వైసీపీలోని కురు వృధ్ధుడు సాంబశివరాజు కుమారుడు పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు)కు చెక్ చెప్పేశారు. ఇక్కడ ఇంచార్జిగా కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన బడ్డుకొండ అప్పలనాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంతో సీనియర్ నేత వర్గీయులు షాక్ తిన్నారు.

గెలుపుపై అనుమానమా…?

పోయిన ఎన్నికల్లో జగన్ నెల్లిమర్ల సీటును సురేష్ బాబుకు కేటాయించారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి చెతిలో దాదాపుగా ఏడువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు. పైగా ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలు కూడా కలసిరావడంలేదు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబు ఇక్కడ బలంగా కున్న కాపుల సానుభూతి పొందడంలో విఫలం అవుతున్నారు. దాంతో అదే సామాజికవర్గానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడుకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా అర్ధబలం కూడా పెద్దగా లేకపోవడం కూదా మైనస్ గా భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

గట్టి క్యాండిడేట్…

ఇక అప్పలనాయుడు 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి సీనియర్ నేత పతివాడను అప్పట్లో ఓడించారు. ఆ తరువాత విభజన ప్రభావం ఉన్నా కూడా 2014 ఎన్నికల్లో 23 వేల పై చిలుకు ఓట్లను తెచ్చుకున్నారు. అంగబలం, అర్ధబలం సమృద్ధిగా కలిగిన అప్పలనాయుడైతేనే వచ్చే ఎన్నికలను ఢీ కొట్టగలరని జగన్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ పరిణామంతో సాంబశివరాజు వర్గం డీలా పడిపోయింది. జగన్ పాదయాత్రలో పెద్ద ఎత్తున నెల్లిమర్లలో జనం వచ్చారు. ఇక‌ సాంబమూర్తి రాజుకు సీనియర్ కాంగ్రెస్ నేతగా జిల్లావ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. దాంతో జగన్ నిర్ణయం పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలని అంటున్నారు. మరో వైపు బొత్స వర్గానికి కూడా ఇప్పటికీ ఏమీ తేల్చకుండా జగన్ డైలమాలో పెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*