షర్మిల కేసు… తమ్ముళ్ళకు తలపోటేనా …!!?

ys-sharmila-complaint

సోషల్ మీడియా లో పోస్ట్ పెడితే క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతుంది. దాని ప్రభావం అంతే వేగంగా వ్యాప్తి చెందుతుంది. రాజకీయాల్లో వున్న వారికి సెలబ్రిటీలకు ఇప్పుడు సోషల్ మీడియా అంటే హడలి పోయే పరిస్థితి ప్రస్తుత ట్రెండ్. ముఖ్యంగా మహిళలు సోషల్ మీడియా బాధితుల్లో అత్యధికంగా వుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అందువల్లే రాజకీయాల్లో మహిళలు ప్రవేశించాలన్నా మురికి, బురద మకిలి పులుముతారనే దూరంగా వుంటున్నారు చాలామంది. అయితే దీనిపై ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం మహిళల్లో చైతన్యం వెల్లివిరిసింది. తాజాగా మీ టూ ఇచ్చిన స్ఫూర్తి కావొచ్చు ఎన్నికలు వచ్చేటప్పుడు తనను కించపరిచే వారిని గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుని కావొచ్చు వైఎస్ షర్మిల ఇప్పుడు వార్తల్లో ప్రధాన వ్యక్తిగా మారారు.

టి సర్కార్ పరిధిలో ఫిర్యాదు వెనుక … ?

షర్మిల ప్రస్తుతం హైదరాబాద్ లోనే వుంటున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఫిర్యాదు చేసే అవకాశంతో బాటు దేశంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసే సౌకర్యం ఇప్పుడు ఆన్ లైన్ లో వుంది. దీంతో పాటు ఆమె అభియోగం మోపేది అధికారంలో వున్న తెలుగుదేశం తమ్ముళ్లపై. విశాఖ ఎయిర్ పోర్ట్ లో కత్తి దాడి కేసులో జగన్ పై కేసు పరిశీలించాకా ఏపీలో అయితే తనకేసుకు న్యాయం జరగదని భావించి తెలంగాణ సిపి కి ఫిర్యాదు చేశానని షర్మిల స్వయంగా వెల్లడిస్తున్నారు.

ముసుగు వీరులెవరు?

షర్మిల తాజా కేసు నేపథ్యంలో ఇప్పుడు ముసుగువీరులుగా చలామణిలో వున్న ప్రత్యర్థి పార్టీల్లోని ఐటి బృందాల కు చెక్ పడనుంది. దాంతో బాటు టి సర్కార్ పరిధిలో వున్న సైబర్ క్రైమ్ విభాగం అత్యంత ఆధునిక హంగులతో వున్నది. ఎవరు ఎక్కడి నుంచి ఏ పోస్ట్ చేశారు. వారిని ప్రేరేపించింది ఎవరు అనే అంశాలు దర్యాప్తులో బయటకు రానున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వైసిపి కి ఉపయోగపడనుంది. అంతేకాకుండా నిరాధార ఆరోపణలకు అడ్డుకట్టపడనుంది. మొత్తానికి షర్మిల ధైర్యంగా తేనెతుట్టెను కదిలించి మహిళల హక్కులు ఆత్మగౌరవానికి సంబంధించి ముందడుగు వేశారని వైసిపి వర్గాలు ఆమెకు అండగా నిలిచాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*