జగన్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందే…!!

Y S Jagan mohan Reddy telugu post telugu news

ప్రతిపక్ష నేత పాదయాత్ర సక్సెస్ ఎఫెక్ట్ టిడిపి పై గట్టిగానే పడింది. వైసిపి ప్రకటించిన పెన్షన్ పథకం రెట్టింపు కార్యక్రమాన్ని సరిగ్గా ఎన్నికలకు రెండు నెలలముందు చంద్రబాబు అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయం ప్రకటించి వైసిపికి షాక్ ఇచ్చారు. జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాదని ఆర్ధికమంత్రి యనమల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి నిన్నమొన్నటివరకు వాదిస్తూ వచ్చారు.

ఇంటలిజెన్స్ నివేదికలతో…..

అయితే వృద్ధులకు పెన్షన్ రెట్టింపు చేస్తామని జగన్ ఇచ్చిన హామీ ప్రజల్లో బాగా పనిచేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ నివేదికలు కు తోడు వైసిపి అధినేత యాత్ర సక్సెస్ పసుపు శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దాంతో ఖజానాకు భారమైనా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా సదరు ఓటు బ్యాంక్ ను పూర్తిగా తమవైపు టర్న్ చేయాలన్న వ్యూహంలో విపక్ష హామీల్లో ముఖ్యమైనవి ముందుగానే ప్రకటించి వారికి అస్త్రాలు లేకుండా చేయాలన్న లెక్కలతో బాబు దూకుడు ప్రదర్శించడం మొదలు పెట్టేశారు.

తెలంగాణ ఎన్నికల ప్రభావం …

దీనికి తోడు తెలంగాణ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు గులాబీ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చాయని తెలుగుదేశం గుర్తించింది. ఇక్కడ కూడా సంక్షేమమే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని టిడిపి భావిస్తుంది. అయితే విపక్షం ఇచ్చిన హామీలను కొన్ని అమలు చేస్తే ఎలాంటి ఢోకా ఉండదన్న అంచనాల్లో చంద్రబాబు తన రాజకీయ చాణుక్యుని ప్రదర్శించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేలోగా మరికొన్ని షాక్ లు ఇలాగే వైసిపికి ఇవ్వాలని బాబు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో సర్కార్ అధికారంలోకి రావడానికి సాయం పట్టిన బిజెపి, జనసేన ఇప్పుడు దూరం జరగడంతో బాబు తనదైన శైలి ఎత్తుగడలతో దూసుకుపోతూ వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవడానికి సమాయత్తం కావడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*