బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు కూడా దిగారు. సుమిత్రా మహాజన్ రెండుసార్లు వైసీపీ ఎంపీలతో భేటీ అయి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ససేమిరా అనడంతో విదేశీపర్యటన నుంచి తిరిగి వచ్చిన సుమిత్రా మహాజన్ రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు ఆమోదించడంతో ఉప ఎన్నికలు తథ్యమని తేలిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*