వేసీపీ లీడర్‌ సీట్లో బాబుకు అభ్యర్థే కరువా..!

ఉత్తరాంధ్రలో కీలక జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం హాట్‌ హాట్‌గా మారుతుంది. ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, వైసీపీ, జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 7 సీట్లలో విజయం సాధించగా వైసీపీ పాతపట్నం, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో జెండా ఎగరవేసింది. ప్రస్తుతం ఉన్న జిల్లా గ్రౌండ్‌ పొలిటికల్‌ రిపోర్ట్ బట్టి చూస్తే జిల్లాల్లో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్ధానం, కిడ్నీ సమస్యలపై జనసేన తీసుకున్న స్టాండ్‌తో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనసేన బలమైన ప్ర‌భావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి.

రాజాం నుంచే చికిత్స…..

ఇక మాజీ ఎమ్మెల్యేలు మీసాల నీలకంఠం నాయుడు, కోండ్రు మురళితో పాటు తాజాగా వజ్జి బాబురావు టీడీపీలో చేరడంతో ఆ పార్టీలోనూ జోష్‌ వచ్చింది. ఇదిలా ఉంటే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వనరాయ  కళావతిని ఎదుర్కొనేందుకు టీడీపీ ఆపసోపాలు పడుతుంది. గత రెండు ఎన్నికల్లోనూ 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తర‌పున నిమ్మక సుగ్రీవులు, గత ఎన్నికల్లో వైసీపీ తర‌పున పోటీ చేసిన విశ్వనరాయ కళావతి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతీ సీటు కీలకమైనదే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కాయకల్ప చికిత్స ప్రారంభించిన చంద్రబాబు ముందుగా పార్టీ సీనియర్‌ నేత ప్రతిభా భారతి నియోజకవర్గం అయిన రాజాం నుంచే ఈ చికిత్స ప్రారంభించారు.

తర్వాత పాలకొండ ఆపరేషన్…..

రాజాంలో ప్రతిభా భారతిని పక్కన పెట్టి ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి కోండ్రు మురళీకి నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. గత మూడు ఎన్నికల్లోనూ వరుసుగా ఓడిపోతూ వస్తున్న ప్రతిభాకు సీటు ఇస్తే వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ గెలుపు కష్టమేనని డిసైడ్‌ అయిన బాబు ఆమెకు మరో అవకాశం ఇస్తామని తప్పించారు. ఇక ఇప్పుడు బాబు నెక్ట్స్ ఆపరేషన్‌ పాలకొండే అని తెలిసింది. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జ‌య‌కృష్ణ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చెయ్యలేని పరిస్థితి ఉంది. వైసీపీ దీనిని అనుకూలంగా మలుచుకుని ఇక్కడ క్రమక్రమంగా మరింత బలోపేతం అవుతుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇక్కడ కళావతి కేవలం 1600 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో జ‌య‌కృష్ణ ఇక్కడ దీనిని క్యాష్‌ చేసుకుని పార్టీని బలోపితం చెయ్యాల్సిన అవసరం ఉన్నా ఆ దిశగా చెయ్యడంలో ఫెయిల్‌ అయినట్టే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చూస్తేనే తెలిసిపోతుంది.

ఆమె పేరు పరిశీలనలో……

ఈ క్రమంలోనే చంద్రబాబు నిమ్మక జ‌య‌కృష్ణను ఇన్‌ఛార్జ్‌ నుంచి తప్పించి ఆయన సోదరుడు నిమ్మక పాండురంగకు ఆవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నిమ్మక పాండురంగ 2009 నుంచి 2013 వరకు పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. దీంతో ఈ సారీ ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురు నేతలు సూచిస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యేగా కళావతి ఉండడంతో ఇక్కడ పార్టీ తరుపున మహిళకు సీటు ఇవ్వాలనుకుంటే నిమ్మక పాండురంగ భార్య భువిత పేరు కూడా పరిశీలనలో ఉంది. ఏదేమైన పార్టీకి నిన్నటివరకూ సమస్యగా మారిన రాజాం ఆపరేషన్‌ ను సెట్‌ చేసిన చంద్రబాబు ఇప్పుడు పాలకొండ ఆపరేషన్‌ కూడా త్వరలోనే సెట్‌ చేస్తానని జిల్లా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*