వైసీపీలో రోజా రూట్లో మరో ఫైర్ బ్రాండ్….!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు తురుపు ముక్క‌లుగా క‌లిసి వ‌స్తారో చెప్ప‌డం క‌ష్టం. ప‌క్క పార్టీ వ‌ద్ద‌నుకున్న వారు ఇవ‌త‌లి పార్టీకి గొప్ప‌కావ‌చ్చు… వారు అమితంగా ఉప‌యోగ‌ప‌డ‌నూ వ‌చ్చు! వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్‌, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే  ఆర్.కె. రోజా టీడీపీలో రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఉండి నాడు కాంగ్రెస్‌ను, ఆ నాటి ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని, ఆ పార్టీ వాళ్ల‌ను దుమ్ము దులిపేసేవారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె వైఎస్‌కు దగ్గ‌రై చివ‌ర‌కు ఆయ‌న త‌న‌యుడు స్థాపించిన వైసీపీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎలాగైనా ఎమ్మెల్యేగా గెల‌వాల‌న్న ఆమె కోరిక టీడీపీలో రెండుసార్లు నెర‌వేర‌లేదు. చివ‌ర‌కు వైసీపీ నుంచి ఆమె చిర‌కాల కోరిక నెర‌వేర్చుకున్నారు. ఇప్పుడు ఓ ఎన్నారై మ‌హిళ కూడా రోజా రూట్లోనే వెళుతున్నార‌న్నది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నాటకీయ పరిణామాలతో….

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌కు చెందిన ఎన్నారై మ‌హిళ‌, విడ‌ద‌ల ర‌జ‌నీ కుమారి (వీఆర్‌) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఇదంతా ఎన్నో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య చోటు చేసుకున్నా.. ఆమె వ్యూహాత్మ‌కంగా మాత్రం అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆమె పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌ను ప‌రిచ‌యం చేసిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు సైతం షాకిస్తూ.. ఆయ‌న‌నే ఓడిస్తాన‌ని చెప్పింది ర‌జ‌నీ కుమారి. గుంటూరులోని అత్యంత కీల‌క‌మైన చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న ర‌జ‌నీ కుమారి.,. టీడీపీలో అవ‌కాశం లేక‌పోవ‌డం వెంట‌నే క్ష‌ణ‌కాలం కూడా ఆలోచించ‌కుండానే వైసీపీ తీర్థం పుచ్చుకు న్నారు.

టిక్కెట్ పై హామీ లభించిందా?

అదేస‌మ‌యంలో చిల‌క‌లూరిపేట టికెట్‌పై కూడా గ‌ట్టి హామీ పొందార‌ని స‌మాచారం. ఇదిలావుంటే, ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్న క్ష‌ణం నుంచి జ‌గ‌న్‌కు అనుకూలంగా చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ప్రారంభించింది. ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న ప్ర‌త్యేక హోదాపై కీల‌క మైన వ్యాఖ్య‌లు చేసింది. చంద్ర‌బాబు ఈ విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నార‌ని, ఆయ‌న యూట‌ర్న్ అంకుల్ అయ్యార‌ని విమ‌ర్శించింది. అదేస‌మ‌యంలో త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

జగన్ వల్లనేనంటూ…..

గ‌డిచిన నాలుగేళ్లుగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతు న్నార‌ని, ప్ర‌త్యేక హోదా అనే అంశం ఈనాటికీ.. స‌జీవంగా ఉందంటే.. చంద్ర‌బాబు కూడా యూట‌ర్న్ తీసుకున్నాడం టే.. అది కేవ‌లం జ‌గ‌న్ వ‌ల్లేన‌ని చెప్పారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరి పేట త‌న‌కు మెట్టినిల్ల‌ని, తాను అమెరికా నుంచి పూర్తిగా పెట్టె బేడ స‌ర్దుకుని వ‌చ్చేశాన‌ని, తిరిగి నియోజ‌క‌వ‌ర్గానికి అంకితం కావ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆమె పేర్కొన‌డం ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ద్వారానే ఆమె చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం అయ్యారు. మ‌హానాడులో ఆవేశ‌పూరితంగా ఆమె చేసిన ప్ర‌సంగం ఎంతోమందిని ఆక‌ట్టుకుంది. చంద్ర‌బాబు సైతం డ‌యాస్ మీదే ఆమె ప్ర‌సంగానికి ఫిదా అయ్యి ఆమెను మెచ్చుకున్నారు.

స్ట్రాటజీ మార్చి…..

ఆ ప్ర‌సంగం త‌ర్వాత వెంట‌నే ఆమె టీడీపీ నుంచి చిల‌క‌లూరిపేటలో పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేయ‌డం… అక్క‌డ అవి నెర‌వేరేలా లేవ‌ని డిసైడ్ అయ్యి ఆగ‌మేఘాల మీద అదిరిపోయే స్ట్రాట‌జీతో వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం, చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మితులు కావ‌డం జ‌రిగిపోయాయి. మ‌రి టీడీపీలో ఎమ్మెల్యే కావాల‌నుకున్న రోజా ఆశ‌లు చివ‌ర‌కు వైసీపీలో నెర‌వేరాయి. ఇప్పుడు ర‌జ‌నీది కూడా రోజాలాగానే సేమ్ పొజిష‌న్‌. మ‌రి ఆమె ఎమ్మెల్యే క‌ల ఏమ‌వుతుందో ? మొత్తానికి వైసీపీలో రోజా త‌ర్వాత ర‌జ‌నీనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ర‌జ‌నీ వాయిస్‌ను జ‌గ‌న్ వినియోగించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు పార్టీ ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*