ఫ్యాన్ గాలి ఎలా బయటపడిందంటే ….?

ysrcongressparty-wave-in-andhrapradesh-elections

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వుందన్నది ఎలా తెలిసింది ? టిడిపి దేశ రాజధాని వరకు వెళ్ళి ఎన్నికల కమిషన్ ముందు గగ్గోలు పెట్టడానికి రీజన్స్ ఏమిటి ? అంటే పలు కారణాలు వివరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఈవీఎం లు మొరాయించాయి. ఈ సాంకేతిక సమస్య నుంచి బయటపడేందుకు నిపుణులను ఎన్నికల అధికారులు రంగంలోకి దింపి ఈవీఎం లను సెట్ చేసి మొత్తానికి పోలింగ్ ప్రక్రియ చాలా చోట్ల ఆలస్యం అయినా మమ అనిపించారు. ఇక్కడ దాకా బాగానే వుంది. ఆ తరువాతే టిడిపి అధిష్టానానికి అందిన సమాచారం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది.

ఇలా తెలిసింది …?

మొరాయించిన ఈవీఎం లను మరమ్మత్తులు చేసే సందర్భంలో కొన్ని చోట్ల ఏ పార్టీకి అప్పటివరకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిసిపోయేది. యంత్రాన్ని రిపేర్ చేసే వ్యక్తి అక్కడ వున్న వివిధ పార్టీల ఏజెంట్లను పిలిచి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు నమోదు అయ్యాయో అన్ని క్యాన్సిల్ అవుతాయని రిపేర్ అయిన తరువాత తిరిగి అంతకుముందు ఉన్న ఓట్లు జమ చేస్తామని వారి అనుమతితో సీల్ ఓపెన్ చేశారని వాటిలో ఫ్యాన్ గాలి బయటపడినట్లు వెల్లడౌతోంది. ఈ సమాచారం టిడిపి అధిష్టానం వరకు వెళ్లడంతో పసుపు పార్టీ గాబరా పడిందట. అందుకే దీనిపై యుద్ధానికి సిద్ధం కావాలని డిసైడ్ అయ్యింది అని అంటున్నారు.

ఏదైనా మనమంచికే …

ఒక వేళ ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే ప్రజల్లో సానుభూతి లభిస్తుందని తొండి చేసి గెలిచారని విమర్శలు ఆరోపణలకు ఆస్కారం ఉంటుందన్న వ్యూహం అమలు చేసింది. అదే విజయం సాధిస్తే వైసిపి అక్రమాలను, ఈసీ అన్యాయాన్ని ఓటర్లు ఎదిరించి నిలిచారని చెప్పుకోవచ్చనేది అధికారపార్టీ ఆఖరి అస్త్రంగా మలిచిందంటున్నారు. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం ద్వారా సుప్రీం తలుపు తట్టే అవకాశం ఉందన్న పక్కా లెక్కతో రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు ఆఖరి పోరాటం సాగిస్తున్నారని ప్రచారం నడుస్తుంది. ఏది నిజం అన్నది వచ్చే ఫలితాలను బట్టే తేలిపోనుంది.

Ram Tatavarthi
About Ram Tatavarthi 780 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*