ఆయన హ్యాండిచ్చారుగా… వైసీపీకి ఇబ్బందే?!

ఎన్నిక‌ల స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. ఎవ‌రికి వారు స్వ‌త‌హాగా త‌మ త‌మ దారులు వెతుక్కుంటున్నారు. త‌మ త‌మ రాజ‌కీయ వేదిక చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇటు వైసీపీ నుంచి అటు అధికార టీడీపీ నుంచి కూడా వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లే ధ్యేయంగా నేత‌ల గోడ‌దూకుళ్లు పెరిగిపోయాయి. ఈ ప‌రిణామం పూర్తిగా రాష్ట్ర రాజ‌కీయ ముఖ చిత్రం మారిపోతోంది. ఇక‌, నాయ‌కులు ఈ ప‌రిస్థితిలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా నాయ‌కులు పార్టీలు మారుతున్నారు.

శత్రుచర్ల పార్టీ మారడంతో……

తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీలో కీల‌కంగా ఉన్న సీనియ‌ర్ నేత శ‌త్రుచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర రాజు పార్టీ మార్పు అంశం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిం ది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల‌పై శ‌త్రుచ‌ర్ల ఎంత మేర‌కు ప్ర‌భావం చూపిస్తున్నారనే విష‌యం అంద‌రిలో నూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. నిజానికి శ‌త్రుచ‌ర్ల రాజ‌కీయంగా సీనియ‌ర్ మోస్ట్‌. కాంగ్రెస్‌లో ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన త‌ర్వాత అప్ప‌టి సీనియ‌ర్ నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అనుచ‌రుడిగా వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాత ర‌ద్దయిన నాగూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌రఫున 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఫాలోయింగ్ ఉన్న నేతగా…..

అయితే, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న కుమారుడును రంగంలోకి దింపారు. ఇక‌, చంద్ర‌శేఖ‌ర‌రాజు కోడ‌లు పుష్ప శ్రీవాణి కూడా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. వైఎస్‌పై అభిమానంతో వీరంతా ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరారు. శ‌త్రుచ‌ర్ల వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. విజ‌య‌న‌గ‌రంలో ఆయ‌న త‌న హ‌వా ప్ర‌ద‌ర్శిస్తున్నారు., మంచి ఫాలోయింగ్ ఉన్న నేత‌గా శ‌త్రుచ‌ర్ల గుర్తింపు పొందారు. విజ‌య‌న‌గ‌రంలో వైసీపీని అన్నీతానై న‌డిపిస్తున్నారు. దీంతో ఆ జిల్లాలో బొత్సా వంటి వారు సైతం మౌనంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

తాను పోటీ చేయాలని…..

అయితే, ఈయ‌న ఫ్యామిలీ నుంచి పుష్ప శ్రీవాణి కురుపాం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న కుమారుడు ప‌రీక్షిత్ రాజు అర‌కు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. శ‌త్రుచ‌ర్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానూ పోటీ చేయాల‌ని ఆయ‌న భావించారు. ఈ క్ర‌మంలోనే అర‌కు ఎంపీ సీటు ను ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేసిన కొత్త‌ప‌ల్లి గీత‌.. వైసీపీకి హ్యాండిచ్చిన నేప‌థ్యంలో ఇక్క‌డి నుంచి త‌ను పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

జగన్ నుంచి హామీ రాకపోవడంతో….

అయితే, దీనిపై వైసీపీ అధినేత జ‌గ‌న్ నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. దీంతో శ‌త్రుచ‌ర్ల టీడీపీలోకి జంప్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే, ఈ నిర్ణ‌యం రాత్రికి రాత్రి తీసుకున్న‌దికాద‌ని, గ‌త ఏడాది నుంచే ఆయ‌న త‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని వైసీపీలోని ఓ వ‌ర్గం అంటోంది. ఏదేమైనా.. ఎవ‌రి రాజ‌కీయ దారివారు ప‌దిలం చేసుకుంటున్నార‌నే విష‌యం తాజాగా మ‌రోసారి రుజువైంది. ఇక మామ టీడీపీలోకి జంప్ అవ్వ‌డంతో ఈ ఎఫెక్ట్ కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోడ‌లు పుష్ప శ్రీవాణి గ‌ట్టిగానే ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

 

శ‌త్రుచ‌ర్ల టీడీపీలోకి జంప్

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*