అజ్ఞాత వాసి లో సీక్రెట్ దాచారు ? .. మాకొద్దు బాబూ ఈ నెగెటివ్ సెంటిమెంట్ అంటున్న ఫాన్స్

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి సినిమాకి సంబంధించి ఇప్పుడు ఎక్కడ చూసినా రచ్చ నడుస్తోంది. హీరో పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం మీద ప్రేక్షకులు , బయ్యర్లూ, ఫ్యాన్స్ ఒకే రకమైన అంచనాలతో ఉన్నారు .. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ జంట, మరిన్ని వండర్ లు తెరమీద చూపిస్తారు అనేది అతిపెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సరైన ఫార్మ్ లో లేడు, ఇందాక చెప్పుకున్న అత్తారింటికి దారేది తరవాత అతని ఖాతాలో హిట్ అనేది లేదు. ఆ సినిమా వచ్చి నాలుగేళ్ళు దాటుతోంది.

మరి ఈ పరిస్థితి లో పవన్ కళ్యాణ్ కి హిట్ అయితే అనివార్యం. మరొక పక్క అజ్ఞాత వాసి సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచీ ఇందులో విక్టరీ వెంకటేష్ ఉన్నాడు అంటూ రకరకాల వార్తలు వినపడ్డాయి. వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్నాడు అని అప్పట్లో అన్నారు. అయితే నెమ్మదిగా ఈ న్యూస్ మీద ఎలాంటి కన్ఫిర్మేషన్ లేక సైలెంట్ అయిపోయారు ఫాన్స్ సైతం.టాలీవుడ్ హీరోలలో మంచి కామెడీ టైమింగ్ తో నటించే వారిలో విక్టరీ వెంకటేష్ ఒకడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా రొమాంటిక్ సీన్స్ అయినా వెంకీ తనకు తానే పోటీ అనేలా చేస్తుంటాడు.ఎంత పెద్ద స్టార్ అయినా మహేష్ , పవన్ లతో ఈగో లేకుండా పెద్ద పెద్ద మల్టీ స్టారర్ లు చేసి అందరి మెప్పూ పొందాడు వెంకీ. అక్కినేని నాగ చైతన్య సినిమా ప్రేమం లో సైతం వెంకటేష్ మెరిసి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల చేసిన వెంకటేష్ ఆ సినిమా మాత్రం డీలా పడ్డం బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు పవన్ అభిమానులు.

ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. అజ్ఞాత వాసి సినిమాలో కరెక్ట్ గా వెంకీ పాత్ర నాలుగ నిమిషాలు ఉంటుందట. ఆ పాత్ర ఎదో పెట్టాలని నామమాత్రంగా పెట్టలేదట. సినిమాలో కీలక పాత్రనే ఇచ్చారు అంటున్నారు చాలామంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే .. పవన్ ఫాన్స్ మాత్రం ప్రస్తుతం హిట్ మీద దృష్టి తో ఉన్నారు తప్ప వెంకటేష్ కామియో అవీ ఇవీ కోరుకోవడం లేదు. ఇలాంటి టైం లో ప్లాప్ సెంటిమెంట్ తో ఉన్న వెంకటేష్ మాకొద్దు బాబూ అంటున్నారు. పైగా ఈ సినిమాలో వెంకీ ఉన్నాడు అనే అధికారిక సమాచారం కూడా ఎక్కడా రాలేదు. వెంకీ ఆడియో లాంచ్ లో కూడా కనపడలేదు. సీక్రెట్ దాచి మరీ త్రివిక్రమ్ ట్విస్ట్ ఇవ్వచ్చు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*