ఆ ఒక్క సీన్ కోసం సెన్సార్ దగ్గర మొండికేసిన త్రివిక్రమ్

ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తోంది ఒకే ఒక్క అంశం గురించి .. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది అనేది వారి ఎదురు చూపు. అయితే తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కి బరిలో దిగబోతోంది.

ఈ క్రమంలో సెన్సార్ పూర్తి చేసుకుంది అజ్ఞాతవాసి. సినిమాకి ఏటువంటి కట్ లేకుండా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డ్ ఇవ్వడం జరిగింది.అజ్ఞాతవాసి సినిమానురికార్డు స్థాయిలో ఓవర్ సీస్ లో విడుదలవుతోంది. అన్ని స్క్రీన్ లలో ఓ భారతీయ సినిమా వేయడం ఇదే ప్రధమం.దానికి గల కారణం ఓవర్సీస్లో త్రివిక్రమ్ సినిమాకు ఉన్న క్రేజ్ కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ కావచ్చు.సినిమాకి ఎటువంటి అభ్యంతరాలు కలగకూడదని ముందుగానే సినిమాకు సంబంధించి సెన్సార్ పూర్తి చేసి విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ అంటే ఉన్న క్రేజ్ పక్కన పెడితే, త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడూ యూ సర్టిఫికేట్ తోనే బయటకి వెళతాయి కానీ ఈ సారి యూ బై ఏ ఇచ్చారు.

ఒక ఫైట్ సీన్ లో కాస్తంత రక్తపాతం ఎక్కువ అవడం తో త్రివిక్రమ్ ని ఆ సీన్ కట్ చేస్తే యూ సర్టిఫికేట్ ఇస్తాం అన్నారట సెన్సార్ బోర్డ్ వారు కానీ త్రివిక్రమ్ మాత్రం ఆ సీన్ కట్ చేసేది లేదు అని తేల్చేయడం తో యూ / ఏ దక్కింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒకవేళ తగ్గినా ఈ విషయం లో త్రివిక్రమ్ ఎక్కడా తగ్గడం లేదు . సో ఆ కాన్ఫిడెన్స్ ఏ శ్రీరామరక్ష అనుకుంటున్నారు పవన్ ఫాన్స్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*