చెట్టెక్కి కూర్చున్న వరుణ్

వరుణ్ varun tej

వరుస హిట్స్‌తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. గ‌తేడాది మిస్ట‌ర్ వ‌ర‌కు వ‌రుణ్ కెరీర్ పాతాళంలో ఉంది. ఫిదాతో తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో అప్ప‌టి నుంచి వ‌రుణ్ మార్కెట్ బాగా పెరిగింది. తాజాగా వ‌చ్చిన తొలిప్రేమ మ‌నోడికి వ‌రుస‌గా రెండో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ దిశ‌గా దూసుకుపోతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రై లాభాల్లోకి వెళ్లిపోతోంది.

తొలిప్రేమ త‌ర్వాత వ‌రుణ్‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బ‌డా నిర్మాత‌లు, కొత్త ద‌ర్శ‌కులు క్యూలో ఉంటున్నారు. అయితే స‌రైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినిమాలు ఓకే చేస్తోన్న వ‌రుణ్ రేటు మాత్రం పెంచేశాడ‌ట‌. వ‌రుస ఆఫ‌ర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తుండ‌డంతో రేటు విష‌యంలో మ‌నోడు కాస్త బెట్టుగానే ఉంటున్నాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌. క్రేజ్‌, మార్కెట్ ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌న్న సూత్రాన్ని వ‌రుణ్ ఇప్పుడు క‌రెక్టుగా ఫాలో అవుతున్నాడు.

ఇక వ‌రుణ్ నెక్ట్స్ సినిమా రానాతో ఘాజి లాంటి హిట్ కొట్టిన సంక‌ల్ప్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు వ‌రుణ్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ అందుతోంద‌ట‌. తొలిప్రేమ సినిమా వరకూ రూ.2.5కోట్ల పారితోషికం అందుకున్న వరుణ్ ఈ సినిమాకు రూ. 4 కోట్లు తీసుకుంటున్నాడ‌ట‌.

ఇప్పుడు వ‌రుణ్ రేటు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లోను, యంగ్ హీరోల్లోనూ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుణ్ తేజ్ దిల్ రాజు బ్యాన‌ర్‌లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్ సినిమాలో సీనియ‌ర్ హీరో వెంకీతో క‌ల‌సి న‌టిస్తున్నాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*