తన వ్యాపారానికి పవన్ ని ఫుల్లుగా వాడుకుంటున్న నాగార్జున

తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ హలో చిత్రం కి సంబంధించి ప్రమోషన్ లు పూర్తి అవడం తో తన కొత్త చిత్రం రంగుల రాట్నం మీద పూర్తి దృష్టి పెట్టాడు హీరో నాగార్జున. రాజ్ తరుణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమా కి నాగార్జున ప్రొడ్యూసర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అయ్యిందో ఎప్పుడు పూర్తి అయ్యిందో కూడా తెలీకుండా జరిగిపోయింది కథ మొత్తం.

శ్రీరంజని అనే లేడీ డైరెక్టర్ తో తెరకి ఎక్కిన ఈ సినిమా మీద నాగార్జున మంచిగానే డబ్బు పెట్టాడట. అప్పట్లో ఉయ్యాలా జంపాల తో రాజ్ తరుణ్ ని పరిచయం చేసిన నాగ్ ఇప్పుడు అదే తరుణ్ తో ఈ సినిమా నిర్మించాడు. చాలా తెలివిగా ఈ చిత్రాన్ని ఉన్నట్లుండి సంక్రాంతి రేసులోకి తెచ్చేశాడు నాగ్. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషాన్నీ సోషల్ మీడియాలో పంచుకోలేదు. ఒక్క ప్రెస్ నోట్ కానీ.. ఒక్క యాడ్ కానీ లేదు. సరిగ్గా విడుదల కి పది రోజుల ముందు అత్యంత గొప్ప స్ట్రాటజీ తో విడుదల తేదీ ప్రకటించి సినిమా కి ప్రమోషన్ గ మోదలు పెట్టాడు . ట్రైలర్ కూడా ఇందాకే విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు నాగ్ . సరిగ్గా సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ – బాలయ్య ల తో పోటీ కి దిగడం అంటే చాలా పెద్ద విషయం. కానీ ఆ కాన్సెప్ట్ నే చాలా తెలివిగా ప్రమోషన్ కి వాడుకుంటున్నాడు నాగార్జున.

‘అమ్మో పవన్ కళ్యాణ్ తో పోటీ కి దింపాడు అంటే సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుంది ” అని జనం అనుకుంటారు అనే సూపర్ డూపర్ ప్లాన్ వేసి పవన్ ని తన వ్యాపారానికి సూపర్ గా వాడుకుంటున్నాడు నాగ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*