తొలిప్రేమ విజ‌యం వెన‌క రామోజీరావు

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ – రాశీఖ‌న్నా జంట‌గా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా తొలిప్రేమ‌. ఎప్పుడో 1998లో 20 ఏళ్ల క్రితం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన తొలిప్రేమ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో వ‌రుణ్ న‌టించిన తొలిప్రేమ సైతం నిజంగానే తొలిప్రేమ‌ను ప‌ర‌వ‌శించింద‌న్న టాక్ తెచ్చుకుంది. తొలిప్రేమ టైటిల్ పెట్ట‌డం, ప్రోమోల‌తోనే సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ముందు రోజే ప్రీమియ‌ర్లు ప‌డ‌డం, సినిమాకు హిట్ రావ‌డంతో శ‌నివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే రేంజ్‌లో అదిరిపోయే టాక్ తెచ్చుకుంది.

ఇక వ‌రుణ్‌తేజ్‌కు ఫిదా సినిమా త‌ర్వాత ఆ రేంజ్‌లో ఈ సినిమాకు హిట్ టాక్ వ‌స్తోంది. రెండు వ‌రుస హిట్ల‌తో వ‌రుణ్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా విజ‌యంలో హీరో వ‌రుణ్ తేజ్ & చిత్ర యూనిట్ మీడియా మొఘ‌ల్ రామోజీరావుకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. తొలిప్రేమ టైటిల్ హ‌క్కులు రామోజీకి చెందిన ఉషాకిర‌ణ్ మూవీస్ వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయ‌ట‌.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి తొలిప్రేమ టైటిల్ అయితేనే క‌రెక్టుగా యాప్ట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ప‌దే ప‌దే చెపుతుండడంతో నిర్మాత బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ హ‌క్కులు రామోజీరావు ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని తెలుసుకున్నారు. ఆయ‌న ఉషాకిర‌ణ్ మూవీస్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో వాళ్లు తొలిప్రేమ టైటిల్ హ‌క్కులు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. అలా తొలిప్రేమ టైటిల్ చివ‌ర‌కు వ‌రుణ్ సినిమాకు ద‌క్కింది. ఇప్పుడు సినిమాకు మాంచి హిట్ టాక్ రావ‌డంతో తొలిప్రేమ యూనిట్ సంబ‌రాల‌కు అంతే లేదు. అలా తొలిప్రేమ విజ‌యంలో ప‌రోక్షంగా రామోజీకి కూడా భాగ‌మ‌య్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*