నయనతార కి ఫోన్ చేసి మరీ చివాట్లు పెట్టిన బాలకృష్ణ

ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట తూలడం చాలా ఇబ్బందులకి దారి తీస్తుంది. ఇది రాజకీయాలలో, సినిమా ఇండస్ట్రీ లో చాలా డేంజర్ పరిస్థితి కి తావిస్తుంది. హీరోయిన్ నయనతార తాజాగా హీరో బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాంటివే మరి. తమిళ్ లో నయన్ నటించిన అరమ్ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా… న్యూ ఇయర్ స్పెషల్ గా నయనతారను ఇంటర్వ్యూ చేసింది వికటన్ అనే పత్రిక.

ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆమె ఆయన నాకు తండ్రి లాంటి వారు అనేసిన సంగతి తెలిసిందే. అలాంటి ఫీలింగ్ ఏ హీరోయిన్ కి ఉన్నా తెరమీద రొమాంటిక్ కపుల్ కాబట్టి బయటకి ఆ మాట చెప్పరు ఎవరూ .. కానీ నయన్ మాత్రం ఆ తప్పు చేసేసింది. బాలయ్య తనకు తండ్రిలాంటి వారు అనేసింది. జై సింహా సినిమా వీళ్లిద్దరి కాంబోలో మూడోది. అయితే ఈ న్యూస్ బాలయ్య చెవికి చేరిన వెంటనే ఆయన సీరియస్ అయ్యారట.

వయసులో పెద్ద వాడినే కావచ్చు కానీ అలా ఒక హీరో గురించి హీరోయిన్ కామెంట్ చెయ్యడం చరిత్రలో మొదటి సారి అవ్వడం తో .. ఆమెతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ షిప్ కారణంగా ఫోన్ చేసి మరీ ఆమెకి చివాట్లు పెట్టారట బాలయ్య.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*