రజినీకాంత్ చేసిన పనికి పురుగుల మందు తాగేసాడు

తమిళనాడు ప్రజలు తమ అభిమాన హీరోలను ఎలా ప్రేమిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు . ఒకసారి హీరో మీద అభిమానం పెంచుకుంటే వాళ్లకి గుళ్ళు కట్టడానికి కూడా వెనుకాడరు… ఒక్కో సారి అభిమానం హద్దు మీరితే ఎంతటి విషాదానికి అయినా దారి తీస్తుంది అని మరొక ఉదాహరణ తో తెలిసొచ్చింది. ఈ క్రమంలో తమిళనాడులో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఎందుకంటే తన అభిమాని హీరో అయినా రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ ఆలస్యాన్ని, అస్పష్టతను ఇతను జీర్ణించుకోలేక నిరాశకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ అభిమాని పేరు ఏళుమలై, 42 రెండేళ్ళు వయసు, సేలం జిల్లాలోని అళగాపురం పారైవట్టం ప్రాంతానికి చెందిన రజనీ అభిమాన సంఘం కి ఇతను అధ్యక్షుడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏళుమలై ను ఆసుపత్రికి తిసుకున్ని వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గూర్చి అటు తమిళ రాజకీయాలలోనూ, ఇండస్ట్రీలోనూ చర్చించుకుంటున్నారు, తలైవా వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయనే దానిపై తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. ఈ నెలాఖరు లోగా రజిని తన మనసులో మాట బయట పెడతాడు అని అనుకుంటున్నారు చాలా మంది.

1 Comment on రజినీకాంత్ చేసిన పనికి పురుగుల మందు తాగేసాడు

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1