రాజశేఖర్ సినిమా నుంచి కథ కాపీ కొట్టిన అల్ల అర్జున్ ?

Rajashekhar

న్యూ ఇయర్ కి వచ్చిన అజ్ఞాత వాసి లోని కొడక కోటేశ్వర రావు సాంగ్ ఒకపక్క దున్నేస్తూ ఉంటె మరొక పక్క నా పేరు సూర్య టీజర్ కూడా సూపర్ రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైం లో యూట్యూబ్ లో భలే ఆసక్తికర రికార్డులు సృష్టించిన ఈ టీజర్ లో అల్లూ అర్జున్ నట విశ్వరూపం చూసారు అందరూ.

వక్కంతం వంశీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి ఈ సినిమా కనువిందు అవ్వబోతోంది అనీ, ముఖ్యంగా బన్నీ అభిమానులకి ఈ సినిమా చాలా పాజిటివ్ చిత్రం అవబోతోంది అంటున్నారు అందరూ. అయితే బన్నీ సీరియస్ మిలటరీ పర్సన్ గా మారడం , కొత్త తరహా హెయిర్ స్టైల్ లో కనిపించడం చూస్తూ ఉంటె బన్నీ బాబు అదరహో అనిపిస్తాడు అంటున్నారు అభిమానులు కూడా. అయితే ఒక రౌద్రం , కోపం, సిన్సియారిటీ తో కలగలిపిన ఈ క్యారెక్టర్ సీనియర్ హీరో రాజశేఖర్ చిత్రం నుంచి కాపీ కొట్టారు అనే మాట వినపడుతోంది. చాలా కాలం క్రితం రాజశేఖర్ చేసిన ‘ఆగ్రహం’ సినిమాలో, ఆయన పాత్రను పోలినదిగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కనిపిస్తోందని అంటున్నారు.

‘ఆగ్రహం’ సినిమాలో ఆర్మీ మేన్ అయిన రాజశేఖర్, సెలవులపై ఇంటికి వస్తాడు. సమాజంలో జరుగుతోన్న కొన్ని అక్రమాల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు ..తన కళ్ల ముందు ఎవరు ఎలాంటి తప్పు చేస్తున్నా తనదైన శైలిలో ప్రశ్నిస్తాడు. నా పేరు సూర్య లో అల్లూ అర్జున్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా కథ కూడా అందులోంచి వక్కంతం లిఫ్ట్ చేసాడు అనే మాట వినపడుతోంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*