ర‌వితేజ కొత్త రేటుతో నిర్మాతల క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయ్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్ ఏమంత గొప్ప‌గా అయితే లేదు. కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత రెండేళ్ల గ్యాప్‌తో రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ప‌ర్వాలేద‌నిపించుకుంది. అయితే గ‌త‌వారం ట‌చ్ చేసి చూడు సినిమాతో మ‌రో ఘైర‌మైన డిజాస్ట‌ర్ ఇచ్చాడు. వాస్త‌వంగా మూడున్న‌రేళ్ల‌లో ర‌వితేజ‌కు వ‌చ్చింది ఒక్క‌టే హిట్ అది కూడా రాజా ది గ్రేట్‌.

ర‌వితేజ సినిమాలు ఎంత హిట్ అవుతున్నా అత‌డి మార్కెట్ రూ.30 కోట్ల‌ను ట‌చ్ చేయ‌డం లేదు. ఈ టైంలో మ‌నోడు భ‌యంక‌ర‌మైన ప్లాపులు ఇస్తున్నా కూడా రేటు విష‌యంలో కొండెక్కి కూర్చుంటున్నాడ‌ట‌. ఇదే విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిందంటున్నారు కొంద‌రు సినీజ‌నాలు. రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు సినిమాల‌కు రూ.9 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న ర‌వితేజ ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్‌తో పాటు త‌ర్వాత శ్రీను వైట్ల సినిమాకు కూడా దాదాపు 13 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ట‌చ్ చేసి చూడు త‌ర్వాత వ‌స్తోన్న ఈ రెండు సినిమాల‌కు మార్కెట్ స‌హ‌జంగానే త‌క్కువుగా ఉంటుంది. అయినా ర‌వితేజ రేటు మాత్రం త‌గ్గ‌డం లేద‌ట‌. ర‌వితేజ క‌థ కంటే రెమ్యున‌రేష‌న్‌కే ప్ర‌యారిటీ ఇస్తున్నాడ‌ని..అందుకే స‌రైన హిట్లు రావ‌డం లేద‌న్న వాద‌న కూడా ఉంది. ఈ రేటు చూస్తోన్న కొంద‌రు నిర్మాత‌లు ర‌వితేజ‌తో సినిమా చేయాల‌నుకుని ఇప్పుడు వెన‌క్కి వెళ్లిపోతున్న‌ట్టు కూడా ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ టాక్‌.

రూ.30 కోట్ల మార్కెట్ కూడా లేని హీరోకు రూ.13 కోట్ల రెమ్యున‌రేష‌న్ అంటే అది నిర్మాత‌ల‌కు పెద్ద గుది బండే. ర‌వితేజ ఇప్ప‌ట‌కి అయినా క‌థ‌ల‌ను న‌మ్మాలే కాని రేటును న‌మ్ముకుంటే గ‌తంలో అత‌డు హిట్ కోసం ఏకంగా మూడు నాలుగేళ్లు వెయిట్ చేశాడు. మ‌రోసారి అదే ప‌రిస్థితి రాక మాన‌దేమో.. మాస్ మ‌హ‌రాజ్ తెలుసుకుంటే మంచిది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*