సాయి ప‌ల్ల‌వి ఆ రేంజ్‌లో ఉందా ?

ఫిదాతో తెలుగు ప్రేక్ష‌కులు అంద‌రిని త‌న బుట్ట‌లో వేసుకున్న మ‌ళ‌యాళ బ్యూటీ సాయిప‌ల్ల‌వి నాని ఎంసీఏ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి ఓ సినిమాలో ఉందంటే ఆమెను చూసేందుకే కుర్ర‌కారు థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెడుతోంది. తెలుగులో ఆమెకంటూ మాంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

సాయి ప‌ల్ల‌వికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా ఆమె బిహేవియ‌ర్ విష‌యంలో మాత్రం తెలుగు హీరోలు, నిర్మాత‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎంసీఏ సినిమా విష‌యంలో ఆమె ఇగో ప్రాబ్ల‌మ్‌తో నానిని చాలా ఇబ్బంది పెట్టిన‌ట్టు ఇది చివ‌ర‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డే వ‌ర‌కు వెళ్లింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

ఆమెతో హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న కంప్లైంట్‌లు చాలానే ఉన్నాయి.

ఇక యంగ్ హీరో నాగ‌శౌర్య కూడా త‌న తాజా సినిమా క‌ణం సినిమాలో ఆమెతో ఇబ్బందులు ప‌డిన‌ట్టుగా కూడా టాక్‌. తాజాగా ఆమె త‌మిళ్‌లో సూర్య‌, ధ‌నుష్‌తో పాటు తెలుగులో శ‌ర్వానంద్‌తో కూడా ఓ సినిమా చేస్తోంది. లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో న‌టించేందుకు సాయి ప‌ల్ల‌వి ఏకంగా 1.25 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌.

ఫిదా సినిమా ముందు వ‌ర‌కు ఆ సినిమా త‌ర్వాత ఒప్పుకున్న సినిమాల‌కు రూ.50-60 ల‌క్ష‌లు డిమాండ్ చేసే సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు ఏకంగా ఒకేసారి త‌న రేటును దాదాపు డ‌బుల్ చేసేయ‌డంతో నిర్మాత‌లు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఆమెకు క్రేజ్ ఉండ‌డంతో నిర్మాత‌ల‌కు భార‌మ‌వుతున్నా ఆమె అడిగినంత ఇచ్చుకోక త‌ప్ప‌డం లేద‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*