‘బ్రహ్మాస్త్ర’ లో అఖిల్..?

దాదాపు 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు అక్కినేని నాగార్జున. బాలీవుడ్ లో భారీ తారాగణం – బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నాగ్ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ నెగెటివ్ రోల్స్ లో నటిస్తున్నారు. అంతే కాకుండా తొలిసారిగా ఆఫ్ స్క్రీన్ లవర్స్ రణ్ బీర్ కపూర్ – ఆలియా భట్ లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ గా బల్గేరియాలో జరిగింది. ఇందులో నాగ్ తో పాటు చాలామంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేయగా అందులో రణ్ బీర్, కరణ్ జొహర్ లతో కలిసి అక్కినేని అఖిల్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అఖిల్ కూడా ఉంటాడా..?

నాగ్ ఇందులో 15 నిమిషాల నిడివి ఉన్న కీలకమైన పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ సందర్భంగా అఖిల్ కూడా నాగ్ తో సందడి చేసినట్టు క్లారిటీగా తెలుస్తుంది. దాంతో ఈ చిత్రంలో అఖిల్ కూడా నటించాడా….అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది.