అమ‌లా పాల్‌కి ఆ హీరోతో పెళ్లి… అందులో నిజ‌మెంత‌?

Rumours about Amala paul marriage

త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని పెళ్లి చేసుకొని ఆ త‌ర్వాత ఆయ‌న్నుంచి దూర‌మైంది క‌థానాయిక అమ‌లా పాల్‌. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు సినిమాల‌కి దూరంగా ఉన్న ఆమె, విజ‌య్ నుంచి విభేదాలు రాగానే మ‌ళ్లీ కెమెరా ముందుకెళ్లింది. ఇటీవ‌లే `ర‌త్‌శాస‌న్` అనే చిత్రంతో మంచి హిట్టందుకుంది. ముద‌రు భామే అయినా.. అవ‌కాశాల ప‌రంగా జోరును ప్ర‌ద‌ర్శిస్తోంది. అయితే కెరీర్ ప‌రంగానే కాకుండా… వ్య‌క్తిగ‌త విష‌యాల ప‌రంగా మ‌రోసారి ఆమె వార్త‌ల్లోకి ఎక్కింది.

స్పందించిన హీరో

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అమ‌లాపాల్ పెళ్లి గురించి వదంతులు ఊపందుకున్నాయి. `ర‌త్‌శాస‌న్‌`లో త‌నతో క‌లిసి న‌టించిన హీరో విష్ణు విశాల్‌ని అమ‌లాపాల్ పెళ్లి చేసుకోబోతోంద‌నేది ఆ వ‌దంతుల సారాంశం. విష్ణు విశాల్‌కి కూడా త‌న భార్య‌తో విడాకులు అయ్యాయి. దాంతో ఈ వదంతుల‌కి మ‌రింత బ‌లం చేకూరింది. ఆ విష‌యం ఆ నోటా ఈ నోటా గ‌ట్టిగా వినిపించ‌డం మొద‌ల‌య్యేస‌రికి హీరో విష్ణు విశాల్ స్పందించాడు. ఈ రూమ‌ర్ల‌న్నీ బేస్‌లెస్ అని కొట్టిప‌డేశాడు. మాకు కుటుంబాలున్నాయ‌నే విష‌యం గుర్తుంచుకోండంటూ హిత‌వు ప‌లికాడు. హీరో అయితే స్పందించాడు కానీ… హీరోయిన్ అమ‌లాపాల్ మాత్రం ఈ విష‌యం గురించి సైలెన్స్ మెంటైన్ చేస్తోంది. అస‌లు వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతోందో మ‌రి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*