‘అంత‌రిక్షం’తో ఆ నవలకు సంబంధం ఏంటి..?

hug loss for antariksham

మరో మూడు రోజుల్లో వరుణ్ తేజ నటించిన ‘అంత‌రిక్షం’ సినిమా విడుదల అవ్వబోతుంది. లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘ఘాజి’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. క్రిష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే స్టార్ట్ అయింది. అంత‌రిక్షం నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో సినిమా రాలేదు. అందుకే ఈ సినిమా కోసం తెలుగు చిత్ర‌సీమ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ట్రైలర్ బట్టి ఇది సైన్స్ ఫిక్ష‌న్ అని ఈజీగా గెస్ చేయొచ్చు కానీ ఇందులో ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందని తెలుస్తుంది.

యండమూరి నవల కథతో…

సంకల్ప్ ఆ లవ్ స్టోరీని బాగా డీల్ చేసాడని తెలుస్తుంది. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ న‌వ‌ల ‘చీక‌ట్లో సూర్యుడు’లో ఉన్న పాయింట్ కు, ఈ సినిమాలో లవ్ స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు సమాచారం. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రచించిన ‘చీక‌ట్లో సూర్యుడు’లో కూడా స్పేస్ గురించి ఉంటుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ అస్ట్రోనాట్‌లే. వీరిద్దరూ లవ్ చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనుకోకుండా వాళ్లిద్ద‌రే కొంత‌కాలం అంత‌రిక్షంలో ఉండాల్సి వ‌స్తుంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఎదురైన సంఘటనలు, మళ్లీ తిరిగి ఎలా కలుసుకున్నారనేది ‘చీక‌ట్లో సూర్యుడు’ క‌థ‌. ఇప్పుడు ఇంచుమించు అదే పాయింట్ మన ముందుకు రానున్నాడు సంకల్ప్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*