ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క..!

prabhas and anushka in karthikeya wedding

టాలీవుడ్ సినిమాల్లో జంటగా కలిసి నటించిన ప్రభాస్ – అనుష్క కాంబో అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఫిజిక్, ప్రభాస్ హైట్, అందానికి సరిపడా క్వాలిటీస్ అనుష్క లో ఉన్నాయి. వీరిద్దరి రొమాన్స్ ప్రేక్షకులు పదే పదే కోరుకుంటున్నారు. అదే టైంలో ఇద్దరి మీద బోలెడన్ని రూమర్స్ కూడా ప్రేక్షకులే స్ప్రెడ్ చేస్తుంటారు. అయితే అనుష్క – ప్రభాస్ మధ్యలో ఏముంది అనేది వారు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంటారు. మిర్చి, బిల్లా సినిమాల్లో ప్రభాస్ – అనుష్క జంట నటన ఒక ఎత్తైతే… బాహుబలి 2 పార్ట్స్ లోనూ ఈ జంట నటన అద్భుతం. మరి ఇలాంటి జంట తమ పెళ్లి విషయంలో వస్తున్న రూమర్స్ కి పుల్ స్టాప్ పెట్టి మరోసారి జోడి కడితే ఆ కిక్కే వేరప్పా.

అనుష్క కోసం ప్రత్యేకంగా…

అవును పెళ్లి విషయంలో ప్రభాస్, అనుష్క మీద వస్తున్న హాట్ హాట్ రూమర్స్ కి తోడు ఈ జంట మరోసారి తెర మీద కలిసి నటిస్తే ఆ సినిమాకి ఉండే క్రేజ్ మామూలుది కాదు. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అనుష్క.. ప్రభాస్ తాజా చిత్రంలో గెస్ట్ రోల్ చెయ్యబోతుందట. అయితే అది సాహోలో కాదు గానీ.. రాధాకృష్ణ – ప్రభాస్ – పూజ హెగ్డే కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో అనుష్క ఒక కీలకమైన మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుందట. ఈ పాత్ర అనుష్క కోసమే రాసుకున్నట్టుగా.. అందుకే ఈ పాత్రకి అనుష్కని ఒప్పించి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్, అనుష్కలపై సినిమాలో కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ప్రభాస్ – అనుష్క ఎపిసోడ్ సినిమాలో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందనేది తాజా సమాచారం. మరి భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డేతో పాటుగా అనుష్క కూడా ఉంటుందనే సరికి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*